తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic Diversions : న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు-ఫ్లై ఓవర్లపై రాకపోకలు బంద్

Hyderabad Traffic Diversions : న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు-ఫ్లై ఓవర్లపై రాకపోకలు బంద్

HT Telugu Desk HT Telugu

31 December 2023, 14:27 IST

    • Hyderabad Traffic Diversions : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. ఇవాళ రాత్రి అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Diversions : న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. నూతన సంవత్సర వేడుకల కోసం ముఖ్యంగా నగర యువత పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచి డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేస్తామని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ,సైఫాబాద్, బేగంపేట్ పాటు పలు ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ చేసేందుకు ప్రత్యేకంగా ఐదు బృందాలు ఏర్పాట్లు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇవాళ రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ (ట్యాంక్ బండ్ ,నెక్లెస్ రోడ్ ) వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. జనవరి 1వ తేదీ రాత్రి 10 గంటలకు నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ పైన వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

  • నగరంలోని అన్ని ఫ్లైఓవర్ లు మూసివేస్తారు. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ పై ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు విమానం టికెట్ చూపిస్తేనే అనుమతిస్తారు.
  • ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద సెన్సేషన్ థియేటర్, రజధూత్ లేన్, లక్డీ కాపూల్ వైపు మళ్లిస్తారు.
  • ఖైరతాబాద్ వి.వి.విగ్రహం కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు, ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వివి.విగ్రహం, నిరంకరి, రాజ్ భవన్ వైపు వాహనాలు మళ్లిస్తారు.
  • హిమాయత్ నగర్, లిబర్టీ నుంచి వచ్చే వాహనాల రాకపోకలు ఎగువ ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. ప్రయాణికులు తెలుగు తల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎడమ వైపు వెళ్లాలి.
  • సాధారణ వాహనాల రాకపోకలు కోసం సచివాలయానికి అనుకొని ఉన్న మింట్ కాంపౌండ్ లేన్ మూసేస్తారు.
  • బీఆర్కే భవన్ నుంచి ఎన్టీర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ ను తెలుగు తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ మీదుగా లక్డికాపూల్, అయోధ్య జంక్షన్ వైపు మళ్లిస్తారు.
  • సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ కూడలి, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ వాహనాలు, గూడ్స్ వాహనాలను జనవరి 1వ తేది నుంచి 2 తేది 2 గంటల వరకు నగరంలోకి అనుమతించరు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం