తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ఎన్నికల ప్రభావం, స్థిరాస్తుల కొనుగోలుకు రైట్ టైమ్ అంటున్న నిపుణులు

Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ఎన్నికల ప్రభావం, స్థిరాస్తుల కొనుగోలుకు రైట్ టైమ్ అంటున్న నిపుణులు

HT Telugu Desk HT Telugu

18 November 2023, 20:27 IST

    • Hyderabad Real Estate : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ధరలు స్థిరంగా ఉంటాయని, కాబట్టి బడ్జెట్ లో స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు తెలిపారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్

హైదరాబాద్ రియల్ ఎస్టేట్

Hyderabad Real Estate : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్లాట్ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నా స్థలాల లావాదేవీల్లో సందిగ్ధత నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఇది ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అప్పటికప్పుడు ధరలు పెరిగే అవకాశం తక్కువ కాబట్టి తమ బడ్జెట్ లో స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Farmers Protest : అకాల వర్షాలకు తడిసి ముద్దైన వడ్లు, పలు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతన్నలు

రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్నికల ప్రభావం

దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం దూకుడు మీద ఉందంటున్నారు నిపుణులు. హైదరాబాద్ వంటి నగరాల్లో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు కొనసాగుతున్నాయని, తెలంగాణలో మొన్నటి వరకు పరుగులు పెట్టినా రెండు నెలల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ నిలకడగా ఉందంటున్నారు. ప్రాంతాలను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసే వరకు ఇది ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్నాయని రియాల్టర్లు అంటున్నారు.

హైదరాబాద్ లో 11 శాతం పెరిగిన ఇండ్ల ధరలు

స్థిరాస్తి మార్కెట్ నగరం మొత్తం ఒకే తీరున ఉండదని, ప్రాంతాలను బట్టి అక్కడి మౌలిక వసతులను బట్టి మార్కెట్ మారుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం వేలం వేసిన కోకా పేట్, బుద్వేల్, మోకిల వంటి ప్రాంతాల్లో ఎన్నికల ప్రభావం పెద్దగా కనిపించడం లేదంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు గతేడాదితో పోలిస్తే 11 శాతం పెరిగాయి అంటున్నారు నిపుణులు.

ఇప్పుడే కొన్నుకోడం మేలు

గత మూడు నెలల్లో హైదరాబాద్ లో 7900 ఇళ్లను విక్రయిస్తే అందులో 50 లక్షల లోపు ఇండ్లు కేవలం 749 మాత్రమే విక్రయం జరిగాయంటున్నారు. ఇక 50 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు పలికే ఇండ్లు 3247 వరకు విక్రయం జరిగాయని, కోటి రూపాయల పైగా పలికే ఇండ్లు అత్యధికంగా 4329 విక్రయం జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ ప్రకటించింది. ఈ స్థాయిలో ధరలు ఉండడంతో మళ్లీ పెరగకముందే స్థిరాస్తిని కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నారు నిపుణులు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం