తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం, జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

CM Revanth Reddy : రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం, జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

14 December 2023, 22:06 IST

    • CM Revanth Reddy : రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డితో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే
సీఎం రేవంత్ రెడ్డితో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే

సీఎం రేవంత్ రెడ్డితో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే

CM Revanth Reddy : వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో హైకోర్టు నూతన భవనంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Medak Crime News : దారుణం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి

TS EAPCET 2024 Key : తెలంగాణ ఎంసెట్ అప్డేట్స్ - ఇంజినీరింగ్ స్ట్రీమ్ 'కీ' కూడా వచ్చేసింది, ఇదిగో డైరెక్ట్ లింక్

Indian students dead in US : జలపాతంలో మునిగి...! అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ లు

అదేవిధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి చొరవ చూపాలని చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రెనోవేట్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం