తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mokila Plots Auction : మోకిల ప్లాట్లకు నాల్గో రోజూ భారీ డిమాండ్, రేపటితో ముగియనున్న ఫేజ్-2 వేలం

Mokila Plots Auction : మోకిల ప్లాట్లకు నాల్గో రోజూ భారీ డిమాండ్, రేపటితో ముగియనున్న ఫేజ్-2 వేలం

28 August 2023, 22:00 IST

    • Mokila Plots Auction : హైదరాబాద్ మోకిల ప్లాట్ల వేలంలో నాల్గో రోజు జోరు కొనసాగింది. ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడంతో ప్లాట్ల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
మోకిల ప్లాట్లు వేలం
మోకిల ప్లాట్లు వేలం

మోకిల ప్లాట్లు వేలం

Mokila Plots Auction : మోకిల ప్లాట్ల వేలంలో నాల్గో రోజు అదే జోరు కొనసాగింది. లేఅవుట్ లోపలి ప్లాట్లకు కూడా మంచి డిమాండ్ వస్తుందని హెచ్ఎండీఏ తెలిసింది. నాల్గో రోజు గజం రేటు సుమారు రూ.56,537 పలకగా, గరిష్టంగా గజం రూ.66,000లు, కనిష్టంగా రూ.49,000 లు వచ్చిందని అధికారులు తెలిపారు. నాల్గో రోజు 60 ప్లాట్లు అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 60 ప్లాట్లకు అప్ సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు రాగా మొత్తం రెవెన్యూ రూ.105.16 కోట్లు వచ్చింది. మంగళవారంతో మోకిలా ఫేస్-2 వేలం ప్రక్రియ ముగియనుంది.

ట్రెండింగ్ వార్తలు

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Farmers Protest : అకాల వర్షాలకు తడిసి ముద్దైన వడ్లు, పలు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతన్నలు

భారీ డిమాండ్

హైదరాబాద్ మోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గో రోజు మంచి ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో లేఅవుట్ లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70 వేల నుంచి రూ.1,05, 000ల వరకు రేట్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1 లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్-2 లో 300 ప్లాట్లకు వేలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్ సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా, ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండో రోజు రూ.131.72 కోట్ల రెవెన్యూ, మూడో రోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడి ప్లాట్ల కొనుగోలు కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.

300 ప్లాట్లకు వేలం

మోకిల ఫేజ్-2 మొదటి రోజు ఆన్లైన్ వేలంలో గజం అత్యధికంగా లక్ష రూపాయల ధర పలకింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ మోకిలలో ఏర్పాటు చేసిన భారీ వెంచర్ లో 58 ప్లాట్లకు వేలం నిర్వహించారు. అన్ని ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీ పడ్డారు. రెండో దశలో 300 ప్లాట్లను హెచ్ఎండీఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ద్వారా ఐదు రోజులపాటు ఆన్ లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మోకిలలో రెండో విడతలో చేపట్టిన ప్లాట్ల ఈ-వేలానికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. 361 నంబరు ప్లాటు చదరపు గజానికి రూ.లక్ష చొప్పున 375 గజాలకు రూ.3.75 కోట్లు పలకడం విశేషం. రెండు మినహా మిగతా 58 ప్లాట్లు వేలంలో అమ్ముడుపోయాయి.

ఫేజ్-1లో భారీ ఆదాయం

మోకిల భూముల మొదటి ఫేజ్ వేలంలో హెచ్‌ఎండీఏకు భారీ ఆదాయం లభించింది. చదరపు గజానికి గరిష్ఠ ధర లభించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 50 ప్లాట్ల వేలంతో రూ.121.40 కోట్ల ఆదాయం లభించింది. కోకాపేట భూముల వేలంతో రికార్డు స్థాయి ఆదాయం లభించిన విషయం మరుక ముందే మరో లేఔట్‌లో హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం లభించింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని మోకిల లేఅవుట్‌లోని ప్లాట్ల ఈ-వేలానికి ఊహించిన దాని కంటే అధికంగా స్పందన లభించింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వేలంలో మొకిలా ప్లాట్లు చకచకా అమ్ముడయ్యాయి.

తదుపరి వ్యాసం