తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rape Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో 600 పేజీల ఛార్జ్ షీట్

Hyderabad Rape Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో 600 పేజీల ఛార్జ్ షీట్

HT Telugu Desk HT Telugu

28 July 2022, 22:17 IST

    • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక రేప్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల డీఎన్‌ఏ కీలకంగా మారింది.
బాధితురాలితో నిందితులు(ఫైల్ ఫొటో)
బాధితురాలితో నిందితులు(ఫైల్ ఫొటో)

బాధితురాలితో నిందితులు(ఫైల్ ఫొటో)

జూబ్లీహిల్స్‌ పబ్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు, జస్టిస్ జువైనల్ బోర్డులో జూబ్లీహిల్స్ పోలీసులు వేర్వేరుగా నిందితులపై నేరాభియోగ పత్రాలను దాఖలు చేశారు. ఈ కేసులో 65 మందిని సాక్షులుగా చేర్చారు. సాక్ష్యాలను సైతం పకడ్బందీగా సిద్ధం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

నిందితుల్లో ఐదుగురు మైనర్లు కావడంతో జువైనల్ కోర్టు, మరో వ్యక్తి ఉన్నందున జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో వేర్వేరుగా 600 పేజీలతో ఛార్జ్ షీట్‌ను సమర్పించారు. ఐదుగురు మైనర్లు బెయిల్ పై బయటకు వచ్చారు. సాదుద్దీన్ మాలిక్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.

సామూహిక అత్యాచారం జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటన బయటకు వచ్చింది. మే 31న జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మే 28 సాయంత్రం అమ్నీసియా అండ్ ఇన్సోమ్నియా పబ్‌ నుంచి కారులో మైనర్ బాలికను బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లారని.. ఆ తర్వాత సామూహిక అత్యాచారం చేశారని పేర్కొన్నారు.

అయితే ఆ సమయంలో ఈ కేసు రాజకీయంగా దుమారం రేపింది. మే 28న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే.. మే 31న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక వాంగ్మూలం సేకరించారు. జూన్ 5వ తేదీ వరకు సాదుద్దీన్​తోపాటుగా ఐదుగురు మైనర్లను అరెస్టు చేశారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి.. పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఫోరెన్సిక్ నివేదిక ఈ కేసులో కీలకంగా మారింది.

అత్యాచార ఘటనలో నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376-డి (గ్యాంగ్ రేప్), 323 (గాయాలు కలిగించడం), 376 (కిడ్నాప్) కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలు కారులో వెళ్తుండగా ఫొటోలు, వీడియోలను ప్రసారం చేసినందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద మరో కేసు కూడా నమోదైంది.

నిందితులు నేరానికి ఉపయోగించిన కారు నుండి సేకరించిన ఫోరెన్సిక్ నివేదికలు (FSL), DNA పరీక్ష ఫలితాలను కూడా పోలీసులు ఛార్జ్ షీట్లో జతపరిచారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి సేకరించిన సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డులు, మెసేజులు, ఫోటోగ్రాఫ్‌ల సీడీలను కూడా ఛార్జ్ షీట్‌లో చేర్చారు.

తదుపరి వ్యాసం