తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Common Mobility Card : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్-మెట్రో, ఆర్టీసీ, క్యాబ్.. ఇకపై ఏ వాహనం ఎక్కినా ఒకే కార్డు

Common Mobility Card : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్-మెట్రో, ఆర్టీసీ, క్యాబ్.. ఇకపై ఏ వాహనం ఎక్కినా ఒకే కార్డు

24 July 2023, 14:11 IST

    • Common Mobility Card : హైదరాబాద్ ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో, ఆర్టీసీ, లోకల్ ట్రైన్స్, క్యాబ్, ఆటో ఇలా ప్రజా రవాణాకు సంబంధించి కామన్ మొబిలిటీ కార్డు తీసుకురావాలని నిర్ణయించింది.
మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ సమీక్ష
మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ సమీక్ష

మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ సమీక్ష

Common Mobility Card : హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. ఐటీ పరిశ్రమలో దూసుకుపోతున్న భాగ్యనగరంలో ప్రజా రవాణాను సులభతరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో ప్రజారవాణాను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కామన్ మొబిలిటీ కార్డును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో రైలు, టీఎస్ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటో సర్వీసులను అనుసంధానిస్తూ కామన్ మొబిలిటీ కార్డు అందుబాటులోకి తీసుకురానుంది. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్.. మెట్రో, టీఎస్ఆర్టీసీ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

కామన్ మొబిలిటీ కార్డు

హైదరాబాద్ మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేసేందుకు కీలక పథకాలు అందుబాటులోకి తీసుకువస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజా రవాణా వ్యవస్థ మరింత పటిష్ఠంగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం... త్వరలో కామన్ మొబిలిటీ కార్డు అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థలో కామన్ మొబిలిటీ కార్డు కీలకంగా మారనున్నట్లు అధికారులు అంటున్నారు. ఆగస్టు రెండో వారం నుంచి కామన్ మొబిలిటీ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేయాలని మెట్రో, ఆర్టీసీ అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

మెట్రో నగరాల్లో ఉపయోగించేలా...

కామన్ మొబిలిటీ కార్డు ద్వారా మెట్రో రైలు, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ప్రయాణం సులభతరం కానుంది. మొబిలిటీ కార్డు సక్సెస్ అయితే ఎంఎంటీఎస్, క్యాబ్స్, షేర్ ఆటోలు, రిటైల్ సంస్థలకు ఈ సేవలను విస్తరిస్తామని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు అందుబాటులో ఉన్న ఇతర నగరాల్లో ఈ కార్డును వినియోగించవచ్చని ఆయన చెప్పారు. ఇకపై ప్రయాణాలకు ఒకే కార్డు ఉపయోగపడుతుందన్నారు. ముందు హైదరాబాద్ నగరంలో కామన్ మొబిలిటీ కార్డు ప్రారంభించి, అనంతరం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రయాణానికి మాత్రమే కాకుండా ఇతర లావాదేవీలకు ఈ కార్డు ఉపయోగపడేలా మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసే కామన్ మొబిలిటీ కార్డుతో ఇతర మెట్రో నగరాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైల్ ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి సమస్యలు లేకుండా సులభంగా వినియోగించేందుకు వీలు కలుగుతుందని అధికారులు అంటున్నారు. ఈ కార్డును ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్ లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా తెలంగాణ సర్కార్ జారీ చేసే కామన్ మొబిలిటీ కార్డుకి ఒక పేరు సూచించాలని కోరారు.

తదుపరి వ్యాసం