తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao On Amit Shah : సీఎం పదవి కాదు, ముందు సింగిల్ డిజిట్ తెచ్చుకోండి- అమిత్ షాకు హరీశ్ రావు కౌంటర్

Harish Rao On Amit Shah : సీఎం పదవి కాదు, ముందు సింగిల్ డిజిట్ తెచ్చుకోండి- అమిత్ షాకు హరీశ్ రావు కౌంటర్

27 August 2023, 21:05 IST

    • Harish Rao On Amit Shah : సీఎం పదవి కాదు, తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకోవాలని బీజేపీకి మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆయన విమర్శలు చేశారు.
మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

మంత్రి హరీశ్ రావు

Harish Rao On Amit Shah : ఖమ్మం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కుటుంబ పాలనపై అమిత్ షా మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. సరిగ్గా బ్యాట్ పట్టుకోవడం కూడా చేతకాని జై షాకు బీసీసీఐలో కీలక పదవి ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మీరందరు మాజీలవుతారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కు నూకలు చెల్లడం కాదు, తెలంగాణ ప్రజలను నూకలు తినాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నప్పుడే బీజేపీ తెలంగాణలో నూకలు చెల్లిపోయాయన్నారు. సీఎం పదవి కాదు ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించాలన్నారు. అవుట్ డేటెడ్ ఆరోపణలతో రాసిచ్చిన స్క్రిప్ట్ తో అమిత్ షా స్కిట్ చేశారంటూ హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

"పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్లకు కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్ ను విమర్శించేది. 2జీ 3జీ 4జీ కాదు, కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది. రాబోయే ఎన్నికల్లో మీరు మాజీలే. సీఎం పదవి కాదు. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీలేని యోధుడు కేసీఆర్. అబద్ధపు విమర్శలు, అవుట్ డేటెడ్ ఆరోపణలు, రాసిచ్చిన స్క్రిప్ట్ తో హోంమంత్రి స్కిట్ చేశారు" - మంత్రి హరీశ్ రావు

స్ట్రాంగ్ లీడర్ కావాలా? రాంగ్ లీడర్ కావాలా?

ఎవరెన్ని ట్రిక్స్ చేసినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు స్ట్రాంగ్ లీడర్ కావాలో? లేక రాంగ్ లీడర్ కావాలో? ప్రజలు ఆలోచించాలన్నారు. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే ఇత‌ర‌ దేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు తెలంగాణలో ఉంటూనే వైద్య విద్య చదివే అవకాశం వచ్చిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజలకు మంచి చేసే పనులు మీడియాలో ఎక్కువగా కనిపించవన్నారు. ఎదుటి వారిని తిడితే వార్తల్లో ఎక్కువ కనిపిస్తామన్నారు. రాష్ట్రానికి పేపర్ లీడర్ కావాలా? ప్రాపర్ లీడర్ కావాలా? అని ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ ఫార్మా హబ్‌, హెల్త్‌ హబ్‌, ఐటీ హబ్‌గా మారిందన్నారు. తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ ఎదిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014లో 30 శాతం డెలివరీలు అయితే నేడు 72.8 శాతానికి పెరిగాయ‌న్నారు.

తదుపరి వ్యాసం