తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Ganesh Visarjan : హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం- ట్రాఫిక్ ఆంక్షలు, విగ్రహాల తరలింపు మార్గాలు ఇలా!

Hyderabad Ganesh Visarjan : హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం- ట్రాఫిక్ ఆంక్షలు, విగ్రహాల తరలింపు మార్గాలు ఇలా!

27 September 2023, 18:51 IST

    • Hyderabad Ganesh Visarjan : హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనోత్సవాలకు పోలీసులు సర్వం సిద్ధం చేశారు. నిమజ్జనం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం

Hyderabad Ganesh Visarjan : హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ నిమజ్జన వేడుకలకు అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం నుంచే గణేశ్ విగ్రహాలు గంగమ్మ ఒడికి బయలుదేరనున్నాయి. దీంతో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేశ్ శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

1. సరూర్‌నగర్ ట్యాంక్ లో గణేశ్ విగ్రహ నిమజ్జన ప్రక్రియ ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసుల నియంత్రణలో ఉంటుంది.

ఎ) గణేష్ విగ్రహాలను తీసుకెళ్లే వాహనాల మార్గం :

  • హయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు ఎల్‌బీ నగర్ జంక్షన్, కొత్తపేట మీదుగా వెళ్లాలి. దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్ తర్వాత ఎడమ వైపు తిరగాలి. శివ గంగా థియేటర్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు మరలాలి.
  • ఎల్‌బీ నగర్ నుంచి వచ్చే గణేశ్ నిమజ్జన వాహనాలు ఎల్‌బీ నగర్ జంక్షన్, కొత్తపేట మీదుగా వెళ్లాలి. దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్, తర్వాత ఎడమ మలుపు తీసుకోవాలి. శివ గంగా థియేటర్ వద్ద ఎడమవైపు సరూర్‌నగర్ ట్యాంక్ కు వెళ్లాలి.
  • వనస్థలిపురం నుంచి వచ్చే వాహనాలు-పనామా గోడౌన్ X రోడ్, ఎల్బీ నగర్ మీదుగా కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, జేసీ బ్రదర్స్ తర్వాత ఎడమ వైపు శివగంగా థియేటర్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
  • సరూర్‌నగర్ వాహనాలు - కొత్తపేట ఎక్స్ రోడ్డు మీదుగా వెళ్లి లైఫ్ట్ తీసుకోవాలి. దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్ వద్ద లెఫ్ట్ తీసుకుని శివ గంగా థియేటర్ వద్ద మళ్లీ లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
  • నాగార్జున సాగర్ రోడ్డు వైపు వాహనాలు.. ఎల్బీ నగర్ జంక్షన్ మీదుగా కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్, J.C బ్రదర్స్ షోరూమ్ తర్వాత ఎడమ మలుపు తీసుకుని శివ గంగా తర్వాత మళ్లీ లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
  • కర్మన్‌ఘాట్ వైపు (శ్రీనివాస కాలనీ, మధురా నగర్, బైరామల్‌గూడ, దుర్గా నగర్)
  • వాహనాలు ఎల్బీ నగర్ జంక్షన్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, వెంకటాద్రి థియేటర్ J.C బ్రదర్స్ షోరూమ్, శివ గంగా థియేటర్ తర్వాత ఎడమవైపు మలుపు తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు మరలాలి.

బి) హైదరాబాద్ వైపు నుంచి వచ్చే గణేష్ విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలకు మార్గం

  • చాదర్‌ఘాట్, మలక్‌పేట్ సైడ్ వాహనాలు మూసారంబాగ్ టీవీ టవర్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్లాలి. కోణార్క్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గర యూ టర్న్ తీసుకోని గడ్డి అన్నారం ఎక్స్ రోడ్డు వద్ద లెఫ్ట్ తీసుకోవాలి. శివ గంగా థియేటర్, శంకేశ్వర్ బజార్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.
  • అంబర్‌పేట్, మూసారాంబాగ్ సైడ్ వాహనాలు మూసారాంబాగ్ టీవీ టవర్ X రోడ్ వద్ద లెఫ్ట్ తీసుకుని దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్లాలి. కోణార్క్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గర యూటర్న్ తీసుకుని గడ్డి అన్నారం ఎక్స్ రోడ్ వద్ద లెఫ్ట్ తీసుకోవాలి. శివగంగ థియేటర్, శంకేశ్వర్ బజార్ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకుని సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.

సి) గణేష్ విగ్రహాలను తీసుకెళ్లి వాహనాలకు మార్గం

సంతోష్‌నగర్, సైదాబాద్, ఐఎస్ సదన్ వైపు వాహనాలు సింగరేణి కాలనీ, సంకేశ్వర్ బజార్, సర్కార్‌నగర్ ట్యాంక్ వైపు వెళ్లాలి.

పార్కింగ్ స్థలాలు

నిమజ్జనం చూసేందుకు వచ్చే సందర్శకులు తమ వాహనాలను జ్యోతి క్లబ్/సరస్వతి శిశు మందర్, ZPHS పాఠశాల సరూర్‌నగర్, పోస్టాఫీసు సమీపంలో (గాంధీ విగ్రహం దగ్గర) పార్కింగ్ చేసుకోవచ్చు. ఇందిర ప్రియదర్శిని పార్క్ వద్ద అధికారుల వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇతర వాహనాలను పార్కింగ్ చేయడానికి అనుమతించరు.

i) గణేష్ విగ్రహాల నిమజ్జనం తర్వాత అన్ని ఖాళీ వాహనాలు ఇందిర ప్రియదర్శిని పార్కు, సరూర్‌నగర్ పాత పోస్టాఫీసు X రోడ్, కర్మన్‌ఘాట్ వైపు లేదా

సరూర్‌నగర్ పోస్టాఫీసు వైపు మాత్రమే వెళ్లాలి.

ii) సరూర్‌నగర్ పోస్టాఫీసు మీదుగా సరూర్‌నగర్ ట్యాంక్ వైపు వాహనాలు అనుమతించరు.

2. సఫిల్‌గూడ ట్యాంక్ గణేష్ విగ్రహ నిమజ్జనం మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఉంటుంది.

  • మెట్టుగూడ టి జంక్షన్ (హైదరాబాద్ నగర సరిహద్దులు) : మెట్టుగూడ నుంచి మల్కాజిగిరి ఎక్స్‌ రోడ్డు వైపు భారీ వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు
  • లాలాపేట్ వైపు మళ్లిస్తారు. ప్రజలు లాలాపేట్, ZTC-HB కాలనీ- రమాదేవి-ECIL మీదుగా నేరేడ్‌మెట్‌కు ప్రయాణించవచ్చు.
  • ఆనంద్‌బాగ్ ఎక్స్ రోడ్ : మల్కాజిగిరి ఎక్స్ రోడ్ నుంచి సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. సఫిల్‌గూడ జంక్షన్, ఉత్తమ్ నగర్ , ZTC వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ప్రజలు వినాయక్ నగర్ వైపు వెళ్లాలని అనుకుంటే ZTC-మౌలాలి కమాన్, రమాదేవి- ECIL-రాధిక X రోడ్ - నేరేడ్‌మెట్- వినాయక్ నగర్ మీదుగా వెళ్లవచ్చు.
  • ఉత్తమ్ నగర్ RUB - AOC ప్రాంతం నుంచి సాధారణ ట్రాఫిక్ అనుమతించరు. ఆనంద్ బాగ్ , గౌతమ్ నగర్ వైపు మళ్లిస్తారు. సాధారణ ప్రజానీకం
  • మల్కాజిగిరి వైపు వెళ్లాలనుకునే వారు గౌతమ్ నగర్ - అనుటెక్స్ , మల్కాజిగిరి ఎక్స్ రోడ్ మీదుగా వెళ్లవచ్చు.

3. కాప్రా ట్యాంక్ గణేశ్ విగ్రహ నిమజ్జనాలు కుషాయిగూడ ట్రాఫిక్ పీఎస్ పరిధిలోకి

భాస్కర్ రావు నగర్: నేతాజీ నగర్ వైపు వెళ్లే సాధారణ ప్రజల కోసం భాస్కర్ రావు నగర్ బస్ స్టాప్ వద్ద 27 అవెన్యూ రోడ్డు, సైనిక్‌పురి డైవర్షన్ పాయింట్ పెట్టారు.

నేతాజీ నగర్ X రోడ్డు : పాత కాప్రా నుంచి యాప్రాల్ వైపు వెళ్లే సాధారణ ప్రజల కోసం.... నేతాజీ నగర్ X రోడ్డు వద్ద కెనరా జంక్షన్ వైపు డైవర్షన్ పాయింట్ పెట్టారు.

4. ఉప్పల్ ట్రాఫిక్ PS అధికార పరిధిలో గణేష్ నిమజ్జనం

చెంగిచెర్ల ఎక్స్ రోడ్స్ నుంచి ఉప్పల్ వైపు భారీ వాహనాలు (గణేష్ విగ్రహాల వాహనాలు తప్ప) చెంగిచెర్ల ఎస్స్ రోడ్డు నుండి ఉప్పల్ X రోడ్స్ వైపు అనుమతించరు. IOCL, చెంగిచెర్ల మీదుగా NFC వైపు మళ్లిస్తారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి : రామంతపూర్ గణేశ్ విగ్రహాలు ఫ్లై ఓవర్ నిర్మాణం దృష్ట్యా రామాంతపూర్ ప్రాంతం నుంచి అంబర్‌పేట వైపు అనుమతించరు. అందువల్ల ఊరేగింపులను రామంతపూర్ ప్రాంతం నుంచి మళ్లిస్తారు. హబ్సిగూడ స్ట్రీట్ నెం.8 లేదా ఉప్పల్ X రోడ్స్, సర్వే ఆఫ్ ఇండియా, ఎక్మినార్ మసీదు, హబ్సిగూడ, తార్నాక వైపు విగ్రహాలు రూట్ ఏర్పాటు చేశారు.

5. భారీ వాహనాలను ఈ మార్గాల్లో అనుమతించరు(గణేశ్ నిమజ్జన వాహనాలు మినహా)

1. బైరామల్‌గూడ నుంచి చంపాపేట్

2. చెంగిచెర్ల నుంచి ఉప్పల్

3. సఫిల్‌గూడ ట్యాంక్‌కు (అన్ని గూడ్స్ వాహనాలు) నేరెడ్‌మెంట్

4. RK పురం నుంచి ECIL

5. లాలాగూడ టీ జంక్షన్ నుంచి మీర్జాలగూడ వరకు

ట్రాఫిక్ ఆంక్షలు 28వ తేదీ ఉదయం 06.00 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 8 గంటల వరకు కొనసాగుతాయి. గణేశ్ నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రజలు, వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.

హైదరాబాద్ పరిధిలో

బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగే ప్రధాన శోభాయాత్రతో పాటు ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతించరు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు హైదరాబాద్ లోకి అనుమతిలేదు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్‌ఆర్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘల్ పురా, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజి వద్ద వాహనాలను మళ్లిస్తారు.

చంచల్ గూడ జైలు చౌరస్తా, మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జామ్ బాగ్ క్రాస్ రోడ్స్, కోటి ఆంధ్రాబ్యాంకు వద్ద వాహనాలను మళ్లింపు ఉంటుంది. మధ్య మండలంలో చాపెల్ రోడ్డు ప్రవేశం, జీపీవో వద్ద గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రి, స్కైలైన్ రోడ్డు ప్రవేశం, దోమల్ గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడలి, బూర్గుల రామకృష్ణా రావు భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్, ఖైరతాబాద్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ జంక్షన్, కవాడిగూడ కూడలి, ముషీరాబాద్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం, ఇందిరా పార్క్ జంక్షన్ వద్ద వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.

నిమజ్జనం తర్వాత

ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఖాళీ వాహనాలను నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, కేసీపీ మీదుగా తీసుకెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం చేసిన వాళ్లు వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా తీసుకెళ్లాలి. బైబిల్ హౌజ్ రైల్ ఓవర్ బ్రిడ్డి మీదుగా లారీలను అనుమతించరు.

పార్కింగ్‌ ఇక్కడ

ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జాలను చూసేందుకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక సెంటర్లు సిద్ధం చేశారు. సాగర్ చుట్టూ ఉండే ప్రత్యేక పార్కింగ్ కేంద్రాల్లోనే విజిటర్స్ వాహనాలను నిలపాలని పోలీసులు సూచించారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయం దారి, బుద్ధ భవన్ వెనక వైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్‌లో పార్కింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.

తదుపరి వ్యాసం