తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Cpi Alliance :కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఖరారు-కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీకి ఓకే!

Congress CPI Alliance :కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఖరారు-కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీకి ఓకే!

HT Telugu Desk HT Telugu

04 November 2023, 20:04 IST

    • Congress CPI Alliance : ఎట్టకేలకు కాంగ్రెస్, సీపీఐ పొత్తు కుదిరింది. కొత్తగూడెం సీటుతో పాటు, ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించేందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడంతో సీపీఐ పొత్తుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, సీపీఐ పొత్తు
కాంగ్రెస్, సీపీఐ పొత్తు

కాంగ్రెస్, సీపీఐ పొత్తు

Congress CPI Alliance : చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించారు. దీంతో పాటు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేటట్లు పొత్తు కుదిరింది. అలాగే ఖమ్మం జిల్లాలో సీపీఎంకి ఒక స్థానం ఇవ్వాలని ఈ సందర్భంగా సీపీఐ నేతలు కోరారు. అయితే ఈ అంశంపై ఏఐసీసీ జాతీయ కమిటీ నాయకత్వం సీపీఎం కేంద్ర కమిటీతో మాట్లాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

20 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ

సీపీఐకి కొత్తగూడెం సీటు, మరో ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. అంతే కాకుండా మునుగోడులో స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే మునుగోడులో పోటీ వద్దని రేవంత్ రెడ్డి సీపీఐ నేతలకు సూచించగా, పార్టీలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ భేటీలో సీపీఎంతో పొత్తుపైనా సీపీఐ నేతలు ప్రస్తావించగా కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై చర్చిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

మునుగోడులో పోటీ చేస్తామంటున్న సీపీఐ

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో పొత్తులపై స్పష్టం వస్తుంది. సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తుపై అంతకు ముందు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మునుగోడు టికెట్ సీపీఐకి కేటాయిస్తారనే ప్రచారం జరిగినా, ఆ సీటు వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. మునుగోడులో ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే మునుగోడులో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని సీపీఐ నేతలు అంటున్నారు.దీనిపై ఇంకా స్పష్టం రాలేదు. మరోవైపు మునుగోడు సీటును వదులుకోవడంతో నల్గొండ సీపీఐ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కొత్తగూడెం కోసం మునుగోడు స్థానాన్ని వదిలేశారనే విమర్శలు చేస్తున్నారు.

ఒంటరిగానే సీపీఎం పోటీ

కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌ బై చెప్పింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ కు సీపీఎం విధించిన డెడ్ లైన్ ముగియటంతో... తొలి జాబితాను విడుదల చేసింది. 17 స్థానాలతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేదు. పాలేరు, ఖమ్మం, వైరా, మిర్యాలగూడెం, ఇబ్రహీంపట్నంతో పాటు భద్రాచలం, మదిరా స్థానాలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ వైఖరిపై వీరభద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలం, పాలేరు ఇవ్వాలని మొదట్లో అడిగామని, అయితే, వైరా, మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు.

ఆ తర్వాత వైరా స్థానం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేమని చెప్పారని తెలిపారు. మిర్యాలగూడతోపాటు హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్‌ చెబుతోందన్నారు. పరిస్థితులు చూస్తుంటే మాతో పొత్తు వద్దని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుందని అన్నారు. పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించిందని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం