తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Harish Rao : పరిశుభ్రత కోసం ప్రతీ ఆదివారం పది నిమిషాలు కేటాయించండి

Minister Harish Rao : పరిశుభ్రత కోసం ప్రతీ ఆదివారం పది నిమిషాలు కేటాయించండి

HT Telugu Desk HT Telugu

31 July 2022, 15:29 IST

    • ఇంటి చుట్టు చెత్త చెదారం, నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు.
ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న మంత్రి హరీశ్ రావు
ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న మంత్రి హరీశ్ రావు

ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న మంత్రి హరీశ్ రావు

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు తన ఇంటి ఆవరణలో పరిశుభ్రత పనులు చేశారు. వర్షాకాలంలో వ్యాధులను అరికట్టడానికి ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరూ పది నిమిషాలు సమయం పరిసరాల శుభ్రత కోసం సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాథులు ప్రబలుతున్నాయన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందలో భాగంగానే.. ఆయన ఇంటి ఆరణలో క్లీన్ చేశారు. ఇంట్లోకి దోమలు రాకుండా చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలలో ఉన్న నీటిని తొలగించి వాటిని శుభ్రం చేశారు. డెంగీని నివారించాలంటే.. పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు.

మరోవైపు తెలంగాణలో దోమకాటు ప్రమాదకరం అవుతోంది. ఫలితంగా రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. చినుకుజాడతో దోమల బెడద, దాంతో పాటే డెంగీ కేసులు వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా.. సుమారు 1200పైగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆందోళన మెుదలైంది. ఈ జనవరి నుంచే డెంగీ కేసులు నమోదవుతున్నాయి. కానీ ఏప్రిల్‌లో ఏకంగా 100 మందికి పైగా కేసులు వచ్చాయి. జూన్‌లో అత్యధికంగా 565 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటికే 250కిపైగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. పరిశుభ్రత పాటీంచాలని కోరుతోంది.

తదుపరి వ్యాసం