తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group1 Update: తెలంగాణలో రద్దు కానున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్.. సుప్రీంలో కేసు ఉప సంహరించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

TSPSC Group1 Update: తెలంగాణలో రద్దు కానున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్.. సుప్రీంలో కేసు ఉప సంహరించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

Sarath chandra.B HT Telugu

12 February 2024, 9:57 IST

    • TSPSC Group1 Update: తెలంగాణ గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ రద్దు కానున్నాయి. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
రద్దు దిశగా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌
రద్దు దిశగా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌

రద్దు దిశగా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌

TSPSC Group1 Update: తెలంగాణ గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు కానున్నాయి. గత ఏడాది పేపర్‌ లీక్‌ కారణంగా రద్దైన గ్రూప్‌1 ప్రాథమిక పరీక్షల్ని రెండోసారి నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. గ్రూప్1 ప్రిలిమ్స్‌ నిర్వహణలో లోపాలను హైకోర్టు సైతం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌1 పరీక్షల్ని రద్దు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

తాజాగా సుప్రీం కోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఉప సంహరించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోనుంది.

గత ఏడాది అక్టో బరు 21న దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కు తీసుకునేం దుకు అనుమతివ్వాలని కోరుతూ ఫిబ్రవరి 8న పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 19న విచారణకు రానుంది. కేసు ఉపసంహరణకు అనుమతి లభిస్తే.. రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దు అవుతుందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

గ్రూప్ 1 పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయంపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. 2022 ఏప్రిల్‌ నెలలో 503 పోస్టులతో తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆ తర్వాత ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. 2023 జూన్ 11 రెండోసారి పరీక్షను నిర్వహించారు.

2023 జూన్‌లో 2.33 లక్షల మంది ప్రిలిమ్స్‌ పరీక్ష రాశారు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన విద్యార్ధుల సంఖ్యకు.. తుది కీ విడుదల సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిం చారు.

ఈ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.

గత అక్టోబరు నుంచి విచారణ జరగలేదు. తాజాగా అప్పీలు పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి చేసింది. తీవ్రమైన జాప్యం, విద్యార్ధుల ఎదురు చూపుల నేపథ్యంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇప్పటికే కొత్త పాలక మండలి ఏర్పడింది. దీంతో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తి కావడానికి ఆలస్యమవుతుందనే భావనతోనే పిటి షన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గ్రూప్-1 నోటిఫి కేషన్ వేస్తామని ప్రకటించింది. గ్రూప్-1 క్యాటగిరీలో మరో 60 ఉద్యోగాలను గుర్తిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను భర్తీ చేయాలని కమిషన్‌కు సూచిం చింది. 2022లో 503 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను అదనంగా చేర్చడమా..? పాత నోటిఫికేషన్ రద్దు చేసి అదనపు ఉద్యోగాలతో మరో నోటిఫి కేషన్ ఇవ్వడమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

గ్రూప్‌1 పరీక్ష విధానం, సిలబస్‌లో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. పాత నోటిఫికేషన్ వెలువడి రెండేళ్లు పూర్తై పోవడంతో కొత్త నోటిఫికేషన్‌లో ఎక్కువ పోస్టులతో ఖాళీలు భర్తీ చేయడానికి అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు.

తదుపరి వ్యాసం