తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri : భక్తులకు అలర్ట్... ఇకపై యాదాద్రిలోనూ గోల్డ్, సిల్వర్ డాలర్ల విక్రయం

Yadadri : భక్తులకు అలర్ట్... ఇకపై యాదాద్రిలోనూ గోల్డ్, సిల్వర్ డాలర్ల విక్రయం

21 June 2023, 13:09 IST

    • Yadadri Latest News: యాదాద్రిలో చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణేల( డాలర్) విక్రయాల‌ వెబ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్ టికెట్ సేవలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
యాదాద్రిలోనూ గోల్డ్, సిల్వర్ డాలర్ల విక్రయం
యాదాద్రిలోనూ గోల్డ్, సిల్వర్ డాలర్ల విక్రయం

యాదాద్రిలోనూ గోల్డ్, సిల్వర్ డాలర్ల విక్రయం

Yadadri: యాదాద్రిలో సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. చిరుధాన్యాల ప్రసాదం, బంగారం, వెండి నాణేల( డాలర్) విక్రయాన్ని దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. వెబ్ పోర్టల్ , ఆన్ లైన్ టికెట్ సేవలను కూడా ప్రారంభించిన ఆయన... అంతకుముందు యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి ప్రధాన ఆలయంలో స్వయంబు దేవుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా... ఆలయ ఈవో శ్రీస్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

ట్రెండింగ్ వార్తలు

TS Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా వేతనం, ముఖ్య తేదీలివే

Online Job Fraud: ఆన్​ లైన్​ జాబ్​ పేరుతో మోసం, 12 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు, వరంగల్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలు

TS TET 2024 Hall Tickets : కాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Hyd Brutal Attack: హైదరాబాద్‌లో ఘోరం.. పెంపుడు కుక్క వివాదంతో భార్యాభర్తలపై యువకుల దాడి

ధరల వివరాలు:

బంగారు డాలర్ 3 గ్రాముల ధర - రూ.21,000

వెండి 5 గ్రాముల ధర - రూ. 1,000

ఐదు రకాల చిరుధాన్యాలు, బెల్లంతో తయారు చేసిన 80 గ్రాముల లడ్డూను రూ.40కు విక్రయించాలని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయించింది.

అందుబాటులోకి యాప్…

రాష్ట్రంలోని ఆలయాల సమగ్రాభివృద్ధికి దశల వారీగా చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం... రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పూజలు, సేవలతోపాటు వసతి సౌకర్యాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ టీ యాప్‌ ఫోలియో మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలి విడతగా రాష్ట్రంలోని 36 ప్రధాన ఆలయాల్లో ఈ మొబైల్‌ యాప్‌ ద్వారానే అన్ని సేవలను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రధాన ఆలయాల్లో మొబైల్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా ఆలయాల్లో దర్శనం సహా ఇతర సేవల టికెట్లు, వసతిని టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా భక్తులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. బల్కంపేట ఎల్లమ్మ, వేములవాడ రాజరాజేశ్వర, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, సికింద్రాబాద్‌ మహంకాళి, బాసర సరస్వతి, వరంగల్‌ భద్రకాళి, హైదరాబాద్‌ పెద్దమ్మతల్లి, కొండగట్టు హనుమాన్‌ దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి, కొమురవెల్లి మల్లికార్జునస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, సికింద్రాబాద్‌ గణేశ్‌ టెంపుల్, వరంగల్‌ రామప్ప, వర్గల్‌ సరస్వతీ, జియాగూడ రంగనాథస్వామి ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు కల్పించారు. జాతర, బోనాల సమయాల్లో కూడా ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మేడారం జాతర ప్రసాదం కూడా యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం