తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ex Mp Vivek: బీజేపీలోనే కొనసాగుతానని ప్రకటించిన మాజీ ఎంపీ వివేక్

Ex MP Vivek: బీజేపీలోనే కొనసాగుతానని ప్రకటించిన మాజీ ఎంపీ వివేక్

HT Telugu Desk HT Telugu

26 October 2023, 7:43 IST

    • Ex MP Vivek: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు తాను బీజేపీని వీడుతాననే వార్తల్ని మాజీ ఎంపీ వివేక్ ఖండించారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు వివేక్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారాలను ఖండించారు. 
మాజీ ఎంపీ జి.వివేక్
మాజీ ఎంపీ జి.వివేక్

మాజీ ఎంపీ జి.వివేక్

Ex MP Vivek: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీల్లో ఫిరాయింసులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. బీజేపీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్న రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం వివేక్‌కు చిక్కులు తెచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతునట్లు జోరుగా ప్రచారం జరిగింది. మొదట్లో తాను పార్టీ మారడం లేదంటూ స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు బుధవారం బీజేపీకి రాజీనామా చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు ఆ పార్టీ మరో కీలక నేత వివేక్ వెంకట స్వామి సైతం బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.పార్టీ మార్పు పై వస్తున ప్రచారాలపై మాజీ ఎంపీ వివేక్ స్పందించారు. బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో వివేక్ హాజరయ్యారు.

పెద్దపల్లి నుండి బరిలో దిగుతా : జి.వివేక్

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మాజీఎంపీ వివేక్ స్పష్టం చేశారు.బీజేపీ పార్టీ తరఫున పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతానన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం అన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదని ఇకనైనా తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారు వాటిని ఆపాలని కోరారు. పార్టీ మారే ముందు రోజు వరకు కూడా తాము పార్టీ మారడం లేదని,అవన్నీ ఉట్టి పుకార్లే అంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది.

అక్టోబర్ 5న ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిన రాజగోపాల్ రెడ్డి తాను పార్టీ మారడం అసాధ్యమని, బీజేపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. మునుగోడు లో ఈసారి కాషాయ జెండా ఎగురేవేస్తానని అయన పేర్కొనగా అక్టోబర్ 25న బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.

వివేక్ మాత్రం ఇంకా బీజేపీ నేతలతో కలిసే ఉంటునట్లు కవర్ చేసుకుంటూ ఉంటున్నారని, రాజగోపాల్ రెడ్డి కాస్త బయట పడ్డారని వివేక్ మాత్రం అలా కాదని అన్నీ బేరీజు వేసుకున్నాకే నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

(రిపోర్టింగ్ తరుణ్, హైదరాబాద్)

తదుపరి వ్యాసం