తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ex Mp Vivek Party Change : కేసీఆర్‌ను ఓడించేందుకే పార్టీ మారాను - వివేక్

Ex MP Vivek Party Change : కేసీఆర్‌ను ఓడించేందుకే పార్టీ మారాను - వివేక్

02 November 2023, 15:28 IST

    • Telangana Assembly Elections 2023: కేసీఆర్ ను ఓడించేందుకే పార్టీ మారానని అన్నారు మాజీ ఎంపీ వివేక్. ఎన్నికల్లో తన పోటీ అనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు.
ఖర్గేతో వివేక్ కుటుంబం
ఖర్గేతో వివేక్ కుటుంబం

ఖర్గేతో వివేక్ కుటుంబం

Telangana Assembly Elections 2023: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశామని చెప్పారుయ అందరి సమిష్టి కృషితో వచ్చిన తెలంగాణను… బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

కుటుంబ పాలన, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు వివేక్. నాలుగేళ్లుగా కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశానని… కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ప్రజలు ఇబ్బందులుపడ్డారని చెప్పారు. కమీషన్ల కోసమే రిడిజైన్ చేశారని… కేసీఆర్ ను ఓడించాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా కోరారని… మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు తీసుకున్నానని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు వివేక్. బీజేపీలో నాలుగేళ్ళ క్రితం ఎలా ఉందో నేను చేరాక ఎలా ఉందో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను ఓడించేందుకే పార్టీ మారానని… ఎన్నికల్లో పోటీ అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

తదుపరి వ్యాసం