తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phd Forestry In Fcri : ఫారెస్ట్రీలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్

Phd Forestry in FCRI : ఫారెస్ట్రీలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

20 January 2023, 21:16 IST

    • Phd Forestry in FCRI : ఫారెస్ట్రీలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.. తెలంగాణ అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 29లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
ఫారెస్ట్రీ లో పీహెచ్డీ ప్రవేశాలు
ఫారెస్ట్రీ లో పీహెచ్డీ ప్రవేశాలు

ఫారెస్ట్రీ లో పీహెచ్డీ ప్రవేశాలు

Phd Forestry in FCRI : శ్రీ కాండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ.. 2022 - 23 సంవత్సరానికి పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్రీ కోర్సులో పీహెచ్డీ చేయాలని ఆసక్తితో ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐకార్ లేదా యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫారెస్ట్రీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారు పీహెచ్డీ ప్రవేశాలకు అర్హులు. పీజీ ప్రోగ్రామ్ లో 10 జీపీఏకు కనీసం 7.5 జీపీఏ పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 7.0 జీపీఏ ఉన్నా అర్హులేనని నోటిఫికేషన్ లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ఫారెస్ట్రీలో 4 ఏళ్ల బీఎస్సీ హానర్స్.. 2 ఏళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీ చేసిన అభ్యర్థులు పీహెచ్డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. అభ్యర్థులు తప్పనిసరిగా.. ICAR - AICE - JRF/SRF (Ph.D. -2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. ఎంఎస్సీ ఫారెస్ట్రీలో సాధించిన స్కోర్.. ఐకార్ ప్రవేశ పరీక్ష... ఇంటర్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను... 40 శాతం వెయిటేజీ ఐకార్ ప్రవేశ పరీక్షకు కేటాయించారు. 40 శాతం మార్కులు మాస్టర్స్ ప్రోగ్రామ్, మరో 20 శాతం మార్కులు ఇంటర్య్వూకి కేటాయించారు. ఈ మూడు విభాగాల్లో సాధించిన స్కోర్ ను లెక్కించి.. ఓవరాల్ స్కోర్ గా పరిగణిస్తారు. ఈ మేరకు మెరిట్ జాబితా రూపొందించి... ప్రవేశాలు కల్పిస్తారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు కళాశాల వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశిత పత్రాలను అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000... ఇతరులు రూ. 2000 చెల్లించాలి. జనవరి 20 నుంచి 29వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కళాశాల వెబ్ సైట్ www.fcrits.in సందర్శించగలరు. లేదా 80743 50866, 89194 77851 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.

కాగా... పీహెచ్డీ ఎంట్రెన్స్ కి సంబంధించిన ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం జనవరి 19న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9 వేల776 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.... పరీక్షకు హాజరైన 6 వేల 656 మందిలో 1508 మంది అంటే 22.66 శాతం అర్హత సాధించారు. 47 సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

తదుపరి వ్యాసం