తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cpm : ఆ రెండు సీట్లు ఇవ్వకపోతే పొత్తు కుదరదు, ఒంటరిగానే బరిలోకి- తమ్మినేని వీరభద్రం

CPM : ఆ రెండు సీట్లు ఇవ్వకపోతే పొత్తు కుదరదు, ఒంటరిగానే బరిలోకి- తమ్మినేని వీరభద్రం

HT Telugu Desk HT Telugu

29 October 2023, 18:13 IST

    • CPM : వైరా, మిర్యాలగూడ సీట్లు కేటాయించని పక్షంలో కాంగ్రెస్ పొత్తు ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర తెలిపారు. రెండ్రోజుల్లో పొత్తుపై తేల్చేస్తామన్నారు.
తమ్మినేని వీరభద్రం
తమ్మినేని వీరభద్రం

తమ్మినేని వీరభద్రం

CPM : కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా వైరా, మిర్యాలగూడ నియోజకవర్గాలను సీపీఎంకి కేటాయించని పక్షంలో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఖమ్మంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత వైరా, మిర్యాలగూడతో పాటు భద్రాచలం, పాలేరు నియోజకవర్గాల్లో కూడా తమ పార్టీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తి చేశామన్నారు. అయితే భద్రాచలం, పాలేరు కేంద్రాలను ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేయడంతో కనీసం వైరా, మిర్యాలగూడ ఈ రెండింటిలో పోటీకి అవకాశం కల్పించాలని తెలియజేసినట్లు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

ఒంటరి పోరాటానికి సిద్ధం

తాజాగా కాంగ్రెస్ పెద్దల వైఖరి భిన్నంగా కనిపించిందని సీపీఎంతో పొత్తుకు ఆసక్తి లేనట్లు స్పష్టమవుతుందని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో రెండింటి విషయంలో తాము రాజీ పడినప్పటికీ చివరికి రెండు కేంద్రాలను కేటాయించడంలోనూ కాంగ్రెస్ విముఖత చూపుతోందన్నారు. వైరా సీపీఎంకు ఇచ్చే అవకాశం లేదని మిర్యాలగూడతో పాటు హైదరాబాద్ లో ఒక టికెట్ ఇస్తామని తాజాగా ఆ పార్టీ నేత భట్టి విక్రమార్క చెప్పడం సమంజసంగా లేదన్నారు. మాకు బలం ఉన్న ప్రాంతాల్లో పోటీకి అవకాశం కోరుతుంటే హైదరాబాద్ లో ఓ సీటు ఇస్తామని చెప్పడం సరైనది కాదని తమ్మినేని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తాము ఆశిస్తున్నామని అయితే తమతో పొత్తుకు ఆసక్తి లేనట్లుగా తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. రెండు రోజుల్లో సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ లోపు వైరా, మిర్యాలగూడ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇస్తే కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని, లేని పక్షంలో అనివార్యంగా ఒంటరి పోరాటానికి వెళ్లడం తప్ప మాకు మరో మార్గం లేదని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

రిపోర్టింగ్ : కాపర్తి నరేంద్ర, ఖమ్మం

తదుపరి వ్యాసం