తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cpm Telangana List :కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌ బై - 17 స్థానాలతో తొలి జాబితా విడుదల

CPM Telangana List :కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌ బై - 17 స్థానాలతో తొలి జాబితా విడుదల

02 November 2023, 16:44 IST

    • Telangana Assembly Elections 2023: కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌ బై చెప్పేసింది. పోటీ చేసే స్థానాలతో కూడిన  తొలి జాబితాను విడుదల చేసింది. 
సీపీఎం తొలి జాబితా విడుదల
సీపీఎం తొలి జాబితా విడుదల

సీపీఎం తొలి జాబితా విడుదల

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌ బై చెప్పింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ కు సీపీయం విధించిన డెడ్ లైన్ ముగియటంతో…. జాబితాను విడుదల చేసింది. 17 స్థానాలతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేదు. ఇక జాబితాలో చూస్తే… పాలేరు, ఖమ్మం, వైరా, మిర్యాలగూడెం, ఇబ్రహీంపట్నంతో పాటు భద్రాచలం, మదిరా స్థానాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

పోటీ చేసే స్థానాలు:

  1. భద్రాచలం
  2. అశ్వరావుపేట
  3. పాలేరు
  4. మదిరా
  5. వైరా
  6. ఖమ్మం
  7. సత్తుపల్లి
  8. మిర్యాలగూడ
  9. నల్గొండ
  10. నకిరేకల్
  11. భువనగిరి
  12. హుజుర్ నగర్
  13. కోదాడ
  14. జనగాం
  15. ఇబ్రహీంపట్నం
  16. పటాన్ చెరు
  17. ముషీరాబాద్

జాబితా విడుదల సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర మీడియాతో మాట్లాడారు. బీజేపీని తెలంగాణాలో ఒక్క సీటు గెలవనియ్యమని చెప్పారు. బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్న స్థానాల్లో సీపీఎం నిలబడదని… మునుగోడులో లాగా ఆ స్థానాల్లో బీజేపీని ఓడించే బలమైన పార్టీకి ఓటు వేస్తామని చెప్పుకొచ్చారు.

మరోవైపు కాంగ్రెస్‌ వైఖరిపై వీరభద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలం, పాలేరు ఇవ్వాలని మొదట్లో అడిగామని… అయితే, వైరా, మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని వివరించారు. ఆ తర్వాత వైరా స్థానం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేమని చెప్పారని తెలిపారు. మిర్యాలగూడతోపాటు హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్‌ చెబుతోందని చెప్పారు. పరిస్థితులు చూస్తుంటే మాతో పొత్తు వద్దని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుందని అన్నారు. పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని తమ పార్టీ నిర్ణయించిందని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం