తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cpm Telangana List : కాంగ్రెస్ తో దోస్తీకి గుడ్ బై... అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం - పాలేరు బరిలో తమ్మినేని

CPM Telangana List : కాంగ్రెస్ తో దోస్తీకి గుడ్ బై... అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం - పాలేరు బరిలో తమ్మినేని

05 November 2023, 10:06 IST

    • Telangana Assembly Elections 2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీయం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో వెనక్కి తగ్గిన ఆ పార్టీ…. పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
సీపీయం పోటీ
సీపీయం పోటీ

సీపీయం పోటీ

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌ బై చెప్పింది. ఇప్పటికే పోటీ చేసే స్థానాల విషయంలో క్లారిటీ ఇచ్చిన ఆ పార్టీ…. తాజాగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రకటనను విడుదల చేసింది. ఇందులో 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఫలితంగా కాంగ్రెస్ తో సీపీయం పొత్తు లేనట్లు అయింది.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

జాబితా

సీపీయం అభ్యర్థులు:

  1. భద్రాచలం - కారం పుల్లయ్య
  2. అశ్వరావుపేట -పి. అర్జున్
  3. పాలేరు - తమ్మినేని వీరభద్రం
  4. మదిరా - భాస్కర్
  5. వైరా - భూక్యా వీరభద్రం
  6. ఖమ్మం- శ్రీకాంత్
  7. సత్తుపల్లి- మాచర్ల భారతి
  8. మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి
  9. నకిరేకల్ - చినవెంకులు
  10. భువనగిరి - నర్సింహ్మ
  11. జనగాం - కనకం రెడ్డి
  12. ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య
  13. పటాన్ చెరు - మల్లిఖార్జున
  14. ముషీరాబాద్ - దశరథ్

సీపీఐతో పొత్తు….

Congress CPI Alliance : మరోవైపు చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించారు. దీంతో పాటు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేటట్లు పొత్తు కుదిరింది. అలాగే ఖమ్మం జిల్లాలో సీపీఎంకి ఒక స్థానం ఇవ్వాలని ఈ సందర్భంగా సీపీఐ నేతలు కోరారు. అయితే ఈ అంశంపై ఏఐసీసీ జాతీయ కమిటీ నాయకత్వం సీపీఎం కేంద్ర కమిటీతో మాట్లాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.

సీపీఐకి కొత్తగూడెం సీటు, మరో ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. అంతే కాకుండా మునుగోడులో స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే మునుగోడులో పోటీ వద్దని రేవంత్ రెడ్డి సీపీఐ నేతలకు సూచించగా, పార్టీలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ భేటీలో సీపీఎంతో పొత్తుపైనా సీపీఐ నేతలు ప్రస్తావించగా కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై చర్చిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

తదుపరి వ్యాసం