తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections 2023 : పొత్తు ఖరారు..! సీపీఐకి ఇచ్చే రెండు సీట్లు ఇవే?

TS Assembly Elections 2023 : పొత్తు ఖరారు..! సీపీఐకి ఇచ్చే రెండు సీట్లు ఇవే?

15 October 2023, 10:08 IST

    • Congress Left Parties Alliance in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - సీపీఐ  మధ్య పొత్తు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
కాంగ్రెస్ - కామ్రేడ్లు పొత్తు
కాంగ్రెస్ - కామ్రేడ్లు పొత్తు

కాంగ్రెస్ - కామ్రేడ్లు పొత్తు

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇక తాజాగా 55 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో పలు కీలకమైన స్థానాలను పెండింగ్ లో ఉంచింది. ఇదిలా ఉంటే…. కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

పొత్తులో భాగంగా సీపీఐకి రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో చెన్నూరు, కొత్తగూడెం స్థానాలు ఉన్నాయి. మరోవైపు సీపీఎం నేతలతోనూ పొత్తుపై కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. వీటన్నింటిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 

ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఉత్తమ్ కుటుంబానికి రెండు టికెట్లు దక్కగా… కొత్తగా పార్టీలో చేరిన మైనంపల్లి కుటుంబానికి కూడా రెండు సీట్లు ఖరారు అయ్యాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి బరిలో ఉండనున్నారు.

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా:

  1. బెల్లంపల్లి - గడ్డం వినోద్
  2. మంచిర్యాల - ప్రేమ్ సాగర్
  3. నిర్మల్ - శ్రీహరి రావు
  4. ఆర్మూర్ - వినయ్ కుమార్ రెడ్డి
  5. బోధన్ - సుదర్శన్ రెడ్డి
  6. బాల్కొండ - సునీల్ కుమార్ ముత్యాల
  7. జగిత్యాల – జీవన్‌రెడ్డి
  8. ధర్మపురి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  9. రామగుండం - రాజ్ ఠాకూర్
  10. మంథని - శ్రీధర్ బాబు
  11. పెద్దపల్లి - విజయ రమణారావు
  12. వేములవాడ - ఆది శ్రీనివాస్
  13. మానకొండూరు - కవ్వంపల్లి సత్యనారాయణ
  14. మెదక్ - మైనంపల్లి రోహిత్
  15. ఆందోల్ - దామోదర రాజనర్సింహ్మ
  16. జహీరాబాద్ - ఏ చంద్రశేఖర్
  17. సంగారెడ్డి - జగ్గారెడ్డి
  18. మేడ్చల్ - తోటకూర వజ్రీస్ యాదవ్
  19. మల్కాజ్ గిరి - మైనంపల్లి హన్మంతరావు
  20. గజ్వేల్ - నర్సారెడ్డి
  21. కుత్బుల్లాపూర్ - హన్మంత్ రెడ్డి
  22. ఉప్పల్ - పరమేశ్వర్ రెడ్డి
  23. చేవేళ్ల - భీమ్ భరత్
  24. పరిగి - రాంమోహన్ రెడ్డి
  25. వికారాబాద్ - గడ్డప్రసాద్
  26. ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్
  27. మలక్ పేట - షేక్ అక్బర్
  28. సనత్ నగర్ - నీలిమా
  29. నాంపల్లి - ఫిరోజ్ ఖాన్
  30. కార్వాన్ - మహ్మమద్ అల్ హజ్రీ
  31. గోషామహల్ - మోగిలి సునీత
  32. చంద్రాయణగుట్ట - బోయ నగేశ్
  33. యాకత్ పుర - రవి రాజు
  34. బహదూర్ పూర్ - రాజేశ్ కుమార్
  35. సికింద్రాబాద్ - సంతోష్ కుమార్
  36. కొడంగల్ - రేవంత్ రెడ్డి
  37. గద్వాల్ - సరితా తిరుపతయ్య
  38. అలంపూర్ - సంపత్ కుమార్
  39. నాగర్ కర్నూల్ - కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
  40. అచ్చంపేట - వంశీకృష్ణ
  41. కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణరెడ్డి
  42. షాద్ నగర్ - శంకరయ్య
  43. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు
  44. నాగార్జున సాగర్ - జయవీర్ రెడ్డి
  45. హుజుర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
  46. కోదాడ - ఉత్తమ్ పద్మావతి రెడ్డి
  47. నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  48. నకిరేకల్ - వేముల వీరేశం
  49. ఆలేరు - బీర్ల ఐలయ్య
  50. ఘన్ పూర్ - సింగాపురం ఇందిరా
  51. నర్సంపేట - దొంతి మాధవరెడ్డి
  52. భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ
  53. ములుగు - సీతక్క
  54. మధిర - భట్టి విక్రమార్క
  55. భద్రాచలం - పొదెం వీరయ్య

 

తదుపరి వ్యాసం