తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress: టార్గెట్ 'తెలంగాణ'.. ఎన్నికల టీమ్ ఖరారు, ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి

Telangana Congress: టార్గెట్ 'తెలంగాణ'.. ఎన్నికల టీమ్ ఖరారు, ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి

20 July 2023, 17:13 IST

    • Telangana Assembly Elections 2023: రాబోయే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా ఎన్నికల కమిటీని ప్రకటించింది. 
కాంగ్రెస్ కీలక నిర్ణయం
కాంగ్రెస్ కీలక నిర్ణయం

కాంగ్రెస్ కీలక నిర్ణయం

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసకుంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఇందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఛైర్మన్ గా నియమించింది. మొత్తం 26 మందితో కమిటీ ఉండగా… పార్టీలోని పలువురు సీనియర్ నేతలకు చోటు కల్పించింది.

ట్రెండింగ్ వార్తలు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, రేపు మధ్యాహ్నం సమావేశం

ఎన్నికల కమిటీ వివరాలు

కమిటీ వివరాలు:

-రేవంత్ రెడ్డి - ఛైర్మన్

-భట్టి విక్రమార్క

-జీవన్ రెడ్డి

-మహేశ్ కుమార్ గౌడ్

-జగ్గారెడ్డి,

-గీతారెడ్డి

-అజహరుద్దీన్

-అంజన్ కుమార్ యాదవ్

-జానారెడ్డి

-హనుమంతరావ్

-పొన్నాల లక్ష్మయ్య

-ఉత్తమ్ కుమార్ రెడ్డి

-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-దామోదర రాజనర్సింహ

-మధుయాష్కీ గౌడ్

-శ్రీధర్ బాబు

-సంపత్ కుమార్

-రేణుకా చౌదరి

-పొదెం వీరయ్య

-సీతక్క

-షబ్బీర్ అలీ

-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

-ప్రేమ్ సాగర్ రావ్

-సునీతా రావ్ ముదిరాజ్

ఎక్స్ ఆఫీషియో సభ్యులు:

ఈ ఎన్నికల కమిటీలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎన్ఎస్ యూ ఐ అధ్యక్షుడు, సేవాదళ్ చీఫ్ అర్గైనైజర్స్ కు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని... పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలవాలన్న టార్గెట్ తో పని చేస్తోంది కాంగ్రెస్. కర్ణాటక ఫలితాల తర్వాత పూర్తిగా రూట్ మార్చిన కాంగ్రెస్… రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టింది. పొంగులేటి, జూపల్లి వంటి నేతలను తమవైపుకు తిప్పుకోవటంతో పాటు… ఖమ్మం వేదికగా భారీ సభను తలపెట్టి విజయవంతం చేసింది. ఇదే వేదిక నుంచి కీలకమైన హామీలను ప్రకటించింది. బీఆర్ఎస్ పై పోరాడే విషయంలో రాహుల్ గాంధీతో స్పష్టమైన ప్రకటన చేయింది. ఇదే నెలలో కొల్లాపూర్ వేదికగా మరో భారీ సభను నిర్వహించబోతుంది. ఇందుకు ప్రియాంక గాంధీని రప్పించబోతుంది. ఈ సభ సందర్భంగా చాలా మంది నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల చేరికలకు సంబంధించి కూడా రేపోమాపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఎన్నికలకు మరికొద్ది నెలలే మిగిలి ఉండటంతో… నిత్యం ప్రజల్లో ఉండటంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడిగా పోరాడే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం