తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Chevella Sc St Declaration : ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం- 12 అంశాలతో కాంగ్రెస్ చేవెళ్ల డిక్లరేషన్

Chevella SC ST Declaration : ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం- 12 అంశాలతో కాంగ్రెస్ చేవెళ్ల డిక్లరేషన్

26 August 2023, 20:03 IST

    • Chevella SC ST Declaration : కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. సోనియా గాంధీ సూచనలతో ఎస్సీ, ఎస్టీ డిక్లకేషన్‌ ప్రకటిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్

కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్

Chevella SC ST Declaration : అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామన్నారు. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్‌ రెడ్డి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుగా గద్దర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లకేషన్‌ ప్రకటిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ :

  • ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు, ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకుంటాం
  • ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం ద్వారా ఇళ్లులేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అందజేత
  • అసైన్డ్ భూముల పునరుద్ధరణ-సమాన హక్కులు, బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి లబ్ధిదారులకు అన్ని హక్కులతో పునరుద్ధరణ
  • భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం
  • పోడు పట్టాల పంపిణీ - సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు పంపిణీ
  • మూడు ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు -మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్‌కు రూ.750 కోట్ల నిధుల మంజూరు
  • సమ్మక్క సారలమ్మ గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం (SSGGAP Scheme) ఈ పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు కేటాయింపు
  • అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్ కి రూ.750 కోట్ల నిధులు కేటాయింపు
  • అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం
  • రాష్ట్రంలో కొత్తగా ఐదు ఐటీడీఏలు ఏర్పాటు
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్‌ అయితే రూ.10 వేలు ఆర్థిక సాయం
  • రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్, విదేశాల్లో విద్య - ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు
  • గ్రాడ్యుయేషన్‌, పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పిస్తాం

చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్
తదుపరి వ్యాసం