తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Vinod: పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్‌ వెంటే ప్రజలు ఉంటారన్న బోయినపల్లి

BRS Vinod: పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్‌ వెంటే ప్రజలు ఉంటారన్న బోయినపల్లి

HT Telugu Desk HT Telugu

18 December 2023, 6:18 IST

    • BRS Vinod: తెలంగాణలో జరిగే  పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని  మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు.
బోయినపల్లి వినోద్
బోయినపల్లి వినోద్

బోయినపల్లి వినోద్

BRS Vinod: ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులు తమపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేశారని వాటి వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా తమపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆయన వినోద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో అప్పగిస్తున్నామని వినోద్ చెప్పానరు.

ట్రెండింగ్ వార్తలు

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పామని వినోద్ తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎస్ఓటిఆర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం పన్నుల్లో 82.4% ఇస్తే.. ....బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం తెలంగాణ కు దారి దాపులో కూడా చెల్లించలేదని ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ పరిస్థితి అని వినోద్ ఆరోపించారు. పదే పదే తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పుల గురించి మాట్లాడుతున్నారు కానీ స్థిరాస్తుల గురించి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.

బీజేపీకి డిపాజిట్లు కూడా రావు...

లక్షల ఎకరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసి రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పడిందని ఆయన తెలిపారు. రుణాలు తీసుకుని అభివృద్ధి చేయడం అప్పు కింద రాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షం కేవలం బిఆర్ఎస్ పార్టీ మాత్రమే నని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. బిఆర్ఎస్ హయాంలో మొదటి తేదీ జీతాలు ఇవ్వలేదని మాట్లాడిన బండి సంజయ్... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండు,మూడు నెలలకోసారి ఇస్తున్నారని వినోద్ విమర్శించారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

తదుపరి వ్యాసం