తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Bandi Sanjay: విగ్రహావిష్కరణ చేసే నైతికత కేసీఆర్‌కు లేదన్న బండి సంజయ్

BJP Bandi Sanjay: విగ్రహావిష్కరణ చేసే నైతికత కేసీఆర్‌కు లేదన్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

14 April 2023, 12:23 IST

    • BJP Bandi Sanjay: హైదరాబాద్‌లో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ ఒత్తిడితోనే అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తైందన్నారు. 
తెలంగాణ బీజేపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి నిర్వహిస్తున్న బండి సంజయ్
తెలంగాణ బీజేపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి నిర్వహిస్తున్న బండి సంజయ్

తెలంగాణ బీజేపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి నిర్వహిస్తున్న బండి సంజయ్

BJP Bandi Sanjay: హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం బీజేపీ పోరాట ఫలితామేనని బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ ఒత్తిడి చేయడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహా నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధమైందని బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను పట్టించుకోపోవడంతో, ఒత్తిడి తీసుకురావడం వల్లే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ నిర్మాణ పనులను ఎందుకు పరిశీలించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బీజేపీ వ్యతిరేకం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత సీఎం కేసీఆర్ కు లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ దళిత ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సమాజాన్ని అడుగడుగునా అవమానించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఏనాడు హాజరు కాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన కేసీఆర్ దానిపై ఇప్పటి వరకు క్షమాపణ లేదని, తక్షణం తన వ్యాఖ‌్యలకు క్షమాపణ చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే.. దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. దళితులను మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల భూములను లాక్కునందుకు వారికి క్షమాపణలు చెప్పాలన్నారు.

దళిత బంధు పథకం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ దళిత బంధుకు ఎన్ని నిధులు కేటాయించారో, ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో స్పష్టం చేయాలని కోరారు. ఎనిమిదేళ్లుగా అంబేడ్కర్ సేవలను, ఆశయాలను గుర్తించని ముఖ్యమంత్రి ఎన్నికల ఏడాది అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయాన్ని దళిత సమాజం గుర్తించుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు అంబేద్కర్ ఆశయాలను సమాజానికి వివరించే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదన్నారు.

పేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీని కూడా రాష్ట్రంలో తొలగించారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దళితులు వైద్యం చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదన్నారు. తొమ్మిదేండ్ల తర్వాత కేసీఆర్ కు అంబేడ్కర్ గుర్తొచ్చారని, కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా దళిత సమాజం ఆయన్ను క్షమించదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలకు, స్ఫూర్తికి అనుగుణంగా పాలన చేస్తామని చెప్పారు.

తదుపరి వ్యాసం