తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bharat Biotech : ముక్కు నుంచి కరోనా వ్యాక్సిన్.. ఆగస్టులో రెగ్యులేటరీ లైసెన్స్ వచ్చే ఛాన్స్

Bharat Biotech : ముక్కు నుంచి కరోనా వ్యాక్సిన్.. ఆగస్టులో రెగ్యులేటరీ లైసెన్స్ వచ్చే ఛాన్స్

HT Telugu Desk HT Telugu

02 August 2022, 16:47 IST

    • ఇంట్రానాసల్(నాసికా ద్వారా) కొవిడ్-19 వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ పని చేస్తున్న విషయం తెలిసిందే. అన్నీ సవ్యంగా జరిగితే ఈ నెలలో రెగ్యులేటరీ లైసెన్సులు లభిస్తాయని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

ముక్కు ద్వారా వేసుకునే కరోనా టీకాలు త్వరలో రానున్నాయి. దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సంస్థ భారత్ బయోటెక్ ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా ముక్కుద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. అయితే త్వరలో రెగ్యులేటరీ లైసెన్సులో లభిస్తాయని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

'మేం లైసెన్సుల కోసం దరఖాస్తు చేస్తాం. అంతా సవ్యంగా జరిగితే ఆగస్టులో తెలిసిపోతుంది. ప్రజలు కరోనా వ్యాక్సిన్ నాసికా ద్వారా తీసుకుంటారు. ఏదైనా వేరియంట్ వస్తే సులభంగా వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. భవిష్యత్తులో ప్రజల జీవితాలను రక్షించడానికి వ్యాక్సిన్ వేసేందుకు ఇంజెక్షన్, నాసిక రెండూ పనిచేస్తాయి.' అని ఇటీవల ఓ కార్యక్రమంలో కృష్ణ ఎల్లా అన్నారు.

సుమారు 4,000 మంది వాలంటీర్లతో నాసికా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది భారత్ బయోటెక్. ఇప్పటివరకు ఎటువంటి దుష్ప్రభావాలు లేవని కృష్ణ ఎల్లా చెప్పారు. ఇంట్రానాసల్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

BBV-154 (ఇంట్రానాసల్) ఇమ్యునోజెనిసిటీ, భద్రతను.. కోవాక్సిన్‌తో పోల్చడానికి ఫేజ్-3 క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి DCGI సంస్థ అనుమతిని మంజూరు చేసింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇంజక్షన్ ద్వారా ఇస్తే.. శరీరం కింద మాత్రమే రక్షిస్తుంది. అందుకే టీకాలు తీసుకున్నవారికి ఇప్పటికీ RT-PCR పాజిటివ్‌ను పొందే అవకాశం ఉంది. నాసికా జబ్ మొత్తం శరీరానికి రక్షణ ఇస్తుంది.

గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ ఉంది. మంకీపాక్స్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రపంచంలోని రెండు ప్లాంట్‌లలో ఇది ఒకటని కృష్ణ ఎల్లా చెప్పారు. మరొకటి జర్మనీలోని బవేరియన్ నార్డిక్‌లో ఉందన్నారు.

తదుపరి వ్యాసం