తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Balapur Ganesh Laddu: రూ.27లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ

Balapur Ganesh Laddu: రూ.27లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ

HT Telugu Desk HT Telugu

28 September 2023, 11:07 IST

    • Balapur Ganesh Laddu: గణేష్‌ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్‌ వినాయకుడి చేతిలో కొలువైన లడ్డూ వేలం పాట ఉత్సాంగా జరిగింది.  1994లో కేవలం రూ.450రుపాయలతో మొదలైన లడ్డూ వేలం నేడు రూ.27లక్షలకు చేరింది. 
లడ్డూను దక్కించుకుని దాసరి దయానందరెడ్డి
లడ్డూను దక్కించుకుని దాసరి దయానందరెడ్డి

లడ్డూను దక్కించుకుని దాసరి దయానందరెడ్డి

Balapur Ganesh Laddu: బాలాపూర్‌ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూను తుర్కయాంజిల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి పాడుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని తన తల్లితండ్రులకు కానుకగా ఇస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కూడా వేలంలో పాల్గొన్నా రూ.22లక్షల రుపాయల వద్ద వేలంలో తాను ఆగిపోయినట్లు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

19 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

TS ECET 2024 Results : రేపు తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. గత ఏడాది లడ్డూను వేలంలో రూ.24.60లక్షలకు విక్రయించారు. ఈ ఏడాది రూ.27లక్షల ధర పలికింది. వచ్చే ఏడాది నుంచి లడ్డూ వేలంలో కీలక మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఉత్సవ కమిటీ తీర్మానం ప్రకారం వచ్చే ఏడాది నుంచి వేలంలో లడ్డూ పాడుకున్న వారు అదే ఏడాది డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వేలం సొమ్ములు చెల్లించడానికి గడువు ఇచ్చే వారు. ఇకపై వేలం సొమ్మును అదే ఏడాది చెల్లించాలని నిర్ణయించారు.

తదుపరి వ్యాసం