తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Group 1 Exam : బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు, హైకోర్టు ఆదేశాలు

TS Group 1 Exam : బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు, హైకోర్టు ఆదేశాలు

23 September 2023, 11:11 IST

    • Telangana Group 1 Exam : తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు సార్లు గ్రూప్ - 1 పరీక్షలు రద్దు అయినట్లు అయింది. హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
గ్రూప్ 1 పరీక్ష రద్దు
గ్రూప్ 1 పరీక్ష రద్దు

గ్రూప్ 1 పరీక్ష రద్దు

TSPSC Group 1 Prelims Exam: తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ - 1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం… పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. జూన్ 11వ తేదీన జరిగిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

TS CPGET 2024 : టీఎస్ సీపీజెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Farmers Protest : అకాల వర్షాలకు తడిసి ముద్దైన వడ్లు, పలు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతన్నలు

తెలంగాణలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందుకోసం పరీక్షలు నిర్వహించింది.ఈ పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేసింది. అయితే పేపర్ లీకేజీ వ్యవహరం వెలుగులోకి రావటంతో…. ఈ పరీక్షను రద్దు చేశారు. మళ్లీ కొత్త తేదీలను ప్రకటించింది టీఎస్పీఎస్సీ. తిరిగి జూన్ 11వ తేదీన ఎగ్జామ్ నిర్వహించారు. ప్రిలిమ్స్‌ పరీక్ష కీని జూన్‌ 28 విడుదల చేసింది.జులై 1 నుంచి 5 వరకు కీ పై అభ్యంతరాలు స్వీకరించి…అనంతరం తుది కీ ని ప్రకటించింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఇచ్చి… నవంబరులో మెయిన్స్ పరీక్షలను నిర్వహించే దిశగా టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇదిలా నడుస్తుండగానే…. పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా…. పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

అప్పీల్ కు టీఎస్పీఎస్సీ…?

పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై న్యాయపరంగా ముందుకెళ్లాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తీర్పుపై అప్పీల్ కు వెళ్లనుందని సమాచారం.

ఇప్పటికే ఒకసారి ప్రిలిమ్స్ రాయటం, ఫలితాలు కూడా వచ్చిన తర్వాత పరీక్ష రద్దు కావటంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా తమ విలువైన సమయం కోల్పోయాయని చెప్పారు. అయితే ప్రభుత్వం కూడా…పలుమార్లు అభ్యర్థులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది. ప్రిపరేషన్ అయ్యేందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని, అభ్యర్థులు ఆందోళన చెందవద్దని చెప్పింది. అయితే మళ్లీ పరీక్షను నిర్వహించింది టీఎస్పీఎస్సీ. కానీ పలు అంశాల్లో జాగ్రత్తలు పాటించకపోవటంతో… పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు… ఎగ్జామ్ ను రద్దు చేయటంతో వేలాది మంది అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం