తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medchal Building Tragedy: భారీ వర్షాలతో మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో కూలిన భవనం సెల్లార్, ఏడుగురు వలస కార్మికుల మృతి

Medchal Building Tragedy: భారీ వర్షాలతో మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో కూలిన భవనం సెల్లార్, ఏడుగురు వలస కార్మికుల మృతి

Sarath chandra.B HT Telugu

08 May 2024, 7:29 IST

    •  Medchal Building Tragedy: మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో  ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌‌మెంట్ సెల్లార్‌ గోడ కూలడంతో  ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.  మంగళవారం రాత్రి కురిసిన వర్షాలతో ప్రమాదం జరిగింది. 
మెదక్‌లో గోడ కూలి ఏడుగురు కార్మికుల దుర్మరణం
మెదక్‌లో గోడ కూలి ఏడుగురు కార్మికుల దుర్మరణం

మెదక్‌లో గోడ కూలి ఏడుగురు కార్మికుల దుర్మరణం

Medchal Building Tragedy: భారీ వర్షాలకు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉన్న గోడ కూలి కార్మికులు ఉంటున్న రేకులషెడ్డుపై పడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ కూలిపోవడంతో దాని పక్కనే షెడ్డులో ఉంటున్న ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు గోడ నాని కార్మికులు ఉంటున్నన షెడ్డుపై పడింది.

సెంట్రింగ్‌ పనుల కోసం వచ్చిన కార్మికులు కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరితో పాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులు అపార్ట్‌మెంట‌్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఉంటున్నారు.

ఆరిజన్ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు చెందిన ప్రాజెక్టు సైట్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిహెచ్‌ఎంసి, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో మహిళతో పాటు నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో శంకర్‌, రాంయాదవ్, ఖుషి, గీత, హిమంషు, రాజు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో మరో నలుగురు కార్మికులు కూడా గాయడపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నిర్మాణంలో ఉన్న భవనాల సెల్లార్లలోకి నీరు రావడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆరా…

బాచుపల్లి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుబాలకు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరో నలుగురికి మెరుగైన చికిత్స అందించాలని సిఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

తదుపరి వ్యాసం