తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Special Trains: 97 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే… షెడ్యూల్ ఇదే

Special Trains: 97 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే… షెడ్యూల్ ఇదే

HT Telugu Desk HT Telugu

23 June 2022, 7:51 IST

    • south central railway special trains: దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ టౌన్ నుంచి లింగపల్లి మధ్య 80 ప్రత్యేక రైళ్లతో పాటు హైదరాబాద్ - జైపూర్ మధ్య మరో 10 ప్రత్యేక రైల్ సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు వివరాలను విడుదల చేసింది.
97 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
97 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

97 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

south central railway special trains: ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. హైదరాబాద్ - జైపూర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 97 స్పెషల్ ట్రైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

కాకినాడ టౌన్ టూ లింగపల్లి

కాకినాడ టౌన్ - లింగపల్లి- కాకినాడ టౌన్ మధ్య 80 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ టౌన్ నుంచి రాత్రి 08.10 గంటల బయల్దేరి మరునాడు ఉదయం 09.15కు లింగపల్లికి చేరుకోనుంది. ఈ సర్వీసు మంగళ, బుధ, గురువారం రోజుల్లో ఉండనుంది. జూలై 1 నుంచి 30వ తేదీల మధ్య ఈ సర్వీసులు నడవనున్నాయి. ఇక లింగపల్లి నుంచి సాయంత్రం 06.25కు బయల్దేరి... మరునాడు ఉదయం 07.10 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. మంగళ, గురు, శనివారం రోజుల్లో ఈ సర్వీసులను నడవనున్నాయి.

ఆగే స్టేషన్లు ఇవే....

ఈ ప్రత్యేక రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, అకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగనుంది. ఇందులో ఏసీ 2 టైర్, 3 టైర్ తో పాటు స్లిపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉండనున్నాయి.

హైదరాబాద్ - జైపూర్

హైదరాబాద్ - జైపూర్ -హైదరబాద్ మధ్య 17 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. హైదరాబాద్ నుంచి రాత్రి 08.20 గంటలకు బయల్దేరి.. రెండో రోజు ఉదయం 05.25 సమయానికి జైపూర్ కు చేరుకుంటుంది. జూలై 1 నుంచి 26 ఆగస్టు మధ్య కేవలం శుక్రవారం రోజుల్లో ఈ సర్వీసును నడపనున్నారు. ఇక జైపూర్ నుంచి మధ్యాహ్నం 03.20కు బయల్దేరి రెండో రోజూ... తెల్లవారుజాము 03.00 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. జూలై 3 నుంచి ఆగస్టు 28 మధ్యలో కేవలం శనివారం రోజుల్లో ఈ సర్వీసు నడవనుంది.

ఆగే స్టేషన్లు ఇవే...

ఈ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ ఖేడ్, నాందేడ్, పూర్ణా, హింగోలీ, వాసీమ్, అకోలా, మాల్కాపూర్, కాన్వాడా, ఇత్రాసీ, భోపాల్, ఉజ్జాయిని, రాట్లం, మాండాసూర్, చిత్రగుర్, బిల్ వారియా, బిజాయిన్ పూర్, అజ్మీర్ స్టేషన్లలో ఆగనుంది.

ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో కోరారు. మరోవైపు గోరఖ్ పూర్ - ఎర్నాకులం మధ్య ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించారు. ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

తదుపరి వ్యాసం