తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

SCR: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu

03 June 2022, 15:24 IST

    • వేసవి సీజన్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చేసింది. కాచిగూడ - తిరుపతి మధ్య 4 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను వెల్లడించింది.
కాచిగూడ - తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
కాచిగూడ - తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

కాచిగూడ - తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. వేసవి సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కాచిగూడ -తిరుపతి మధ్య 04 వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ స్పెషల్ ట్రైన్ (నెం.07297) జూన్ 8, 15 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 11 గం.లకు తిరుపతి చేరుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

19 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

TS ECET 2024 Results : రేపు తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

Yadadri Temple : యాదాద్రిలో 'ప్లాస్టిక్' పై నిషేధం - భక్తుల డ్రెస్ కోడ్ పై కీలక నిర్ణయం...!

ఇక జూన్ 9, 16వ తేదీల్లో మధ్యాహ్నం 03.00 గం.లకు ప్రత్యే రైలు (నెం.07298) తిరుపతి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 04.00 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది.

 

 

ఆగేది ఈ స్టేషన్లలోనే...

ఈ ప్రత్యేక రైళ్లు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గోటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సర్వీసుల్లో ఏసీ, ఏసీ టైర్ 2, ఏసీ టైర్ -3, స్లిపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని తెలిపింది. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఈ స్పెషల్ ట్రైన్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులు శ్రీవారి దర్శనానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం