తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Monkeys Carcasses: మంచి నీటి ట్యాంకులో కోతుల కళేబరాలు.. నల్గొండ జిల్లా నందికొండలో ఘోరం

Monkeys Carcasses: మంచి నీటి ట్యాంకులో కోతుల కళేబరాలు.. నల్గొండ జిల్లా నందికొండలో ఘోరం

Sarath chandra.B HT Telugu

04 April 2024, 11:29 IST

    • Monkeys Carcasses: నల్గొండ జిల్లా నందికొండ మునిసిపాలిటీలో ఘోరం జరిగింది. మంచినీటి ట్యాంకులో పడి 20కోతులు మృతి చెందాయి. అదే నీటిని స్థానికులు తాగునీటిగా, గృహావసరాలకు వినియోగిస్తున్నారు 
నందికొండలో మునిసిపాలిటీ వాటర్ ట్యాంకులో కోతుల కళేబరాలు (ప్రతీకాత్మక చిత్రం)
నందికొండలో మునిసిపాలిటీ వాటర్ ట్యాంకులో కోతుల కళేబరాలు (ప్రతీకాత్మక చిత్రం) (AFP)

నందికొండలో మునిసిపాలిటీ వాటర్ ట్యాంకులో కోతుల కళేబరాలు (ప్రతీకాత్మక చిత్రం)

Monkeys Carcasses: నల్గొండ ‍Nalgonda జిల్లా నందికొండ Nandikonda మునిసిపాలిటీ Municipality Water tank వాటర్ ట్యాంకులో 20 కోతుల కళేబరాలు ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. మునిసిపాలిటీ మంచినీరు Drinking Water దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. ట్యాంకులో 20కు పైగా కోతుల కళేబరాలను వెలికితీశారు.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

నీళ్ల ట్యాంకులో భారీగా కోతుల కళేబరాలు ప్రత్యక్షం కావడం కలకలం రేపాయి. తాగునీటికి వినియోగించే ఓవర్‌ హెడ్ నీటి ట్యాంకులో బుధవారం పెద్ద సంఖ్యలో కోతుల మృతదేహాలు ప్రత్యక్షమయ్యాయి. అదే నీటిని గ్రామస్తులు తాగునీటిగా వినియోగిస్తుండటంతో ఆందోళన నెలకొంది.

నల్లగొండ జిల్లాలో మంచినీటి అవసరాలకు వినియోగించే మునిసిపాలిటీ ఓవర్‌‌హెడ్ వాటర్‌ ట్యాంకులో పెద్ద సంఖ్యలో కోతులు మృతి చెందాయి. మంచినీటిని తాగే క్రమంలో ఒకదాని వెంట మరొకటి నీటిలో పడి చనిపోయాయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నీటిలో పెద్ద సంఖ్యలో కోతులు మృతి చెందడంతో వాటి కోసం మిగిలిన కోతులు ట్యాంకుపై తిష్ట వేయడంతో గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది.

నల్లగొండ జిల్లా నందికొండ మునిసిపాలిటీలో ఉన్న పాత నీటి ట్యాంకులో ఈ ఘోరం జరిగింది. నీట మునిగి పెద్ద ఎత్తున కోతులు మృతి చెందిన విషయాన్ని గుర్తించని ప్రజలు కొద్ది రోజులుగా అవే నీటిని గృహ అవసరాలకు వినియోగిస్తు్నారు. వాటర్ ట్యాంకు పై భాగంలో ఉన్న మూతను కొద్దిగా తెరిచి ఉంచడంతో నీటి కోసం ప్రయత్నించిన కోతులు అందులో పడి చనిపోయాయి. అవి కుళ్లిపోవడంతో నీరు దుర్వాసనతో సరఫరా అవుతోంది.

ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్థానికులు నిర్ధిష్టంగా చెప్పలేకపోతున్నారు. నీటిలో దుర్వాసన రావడం, ట్యాంకు పైభాగంలో పెద్ద ఎత్తున కోతులు గుమిగూడి ఉండటంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. ట్యాంకు పైభాగంలో పెద్ద సంఖ్యలో కోతులు ఉండటంతో పైకి చేరుకోడానికి మునిసిపల్ సిబ్బంది శ్రమించాల్సి ఉంది. అతి కష్టమ్మీద ట్యాంకు పై భాగానికి చేరుకున్న సిబ్బంది ట్యాంకులో 20కుపైగా కళేబరాలు నీటిపై తేలియాడటం గుర్తించారు. వాటిని వెలుపలికి తీశారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

వాటర్ ట్యాంక్ పైకప్పు పాత కట్టడం అని, అది కొద్దిగా తెరిచి ఉంచడంతో కోతులు అందులో పడి చనిపోయినట్లు తెలిపారు. ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ప్రజలు అధికారులకు సమాచారం అందించారు.

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. 1వ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్లో కోతుల కళేబరాలు వెలుగు చూసినట్టు గుర్తించారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో పలు ప్రాంతాలకు ఈ ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కోతుల కళేబరాలతో కూడిన నీటిని ఇన్నాళ్లుగా స్థానికులు వినియోగిస్తున్నారు.

మంచినీటి ట్యాంకు పైభాగంలో మూతగా ఉన్న రేకు పక్కకు జరిగిపోయినట్టు గుర్తించారు. పాతకాలం కట్టడానికి మరమ్మతులు చేయాలని స్థానికులు కొన్నాళ్లుగా మునిసిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే కోతులు మృతి చెందాయని చెబుతున్నారు.

తదుపరి వ్యాసం