తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Zimbabwe Vs Nepal : ఓ క్రికెట్ ఫ్యాన్స్ మీకు సలాం.. ఇదే కదా కావాల్సింది..

Zimbabwe Vs Nepal : ఓ క్రికెట్ ఫ్యాన్స్ మీకు సలాం.. ఇదే కదా కావాల్సింది..

Anand Sai HT Telugu

20 June 2023, 11:11 IST

    • ICC World Cup 2023 Qualifiers : జింబాబ్వేలో ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. వారు కూడా తమ జట్టుకు మద్దతుగా స్టేడియం వద్దకు వచ్చారు. అయితే మ్యాచ్ అయిన తర్వాత వారు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.
గ్రౌండ్ క్లీన్ చేస్తున్న ఫ్యాన్స్
గ్రౌండ్ క్లీన్ చేస్తున్న ఫ్యాన్స్

గ్రౌండ్ క్లీన్ చేస్తున్న ఫ్యాన్స్

ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫయర్స్ ప్రారంభమయ్యాయి. జింబాబ్వేలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లు రెండు స్థానాల కోసం పది జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, నేపాల్ (Zimbabwe Vs Nepal ) తలపడ్డాయి. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ ఆటతో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం జింబాబ్వే ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జింబాబ్వే వేదికగా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌(World Cup Qualifiers)కు ఆతిథ్యమివ్వడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారు కూడా తమ జట్టుకు మద్దతుగా స్టేడియం వద్దకు వచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత, అభిమానులు ఇంటికి వెళ్లే ముందు స్టేడియం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. అదే మా వైపు మాత్రం.. ఇంకా చెత్త తీసి స్టేడియంలో పడేసి వెళ్తారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది కదా కావాల్సింది అంటున్నారు.

ఈ మ్యాచులో నేపాల్ మెుదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్స్ షువావ్ బర్టెల్, ఆసిఫ్ షేక్ మెుదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, కుశాల్ 95 బంతుల్లో 99 పరుగులు చేసి.. సెంచరీకి 1 పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఆసిఫ్ 66 పరుగులు చేశాడు. మల్లా 41 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ పాడెల్ 31 పరుగులు చేశాడు. నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. జింబాబ్వే తరఫున నగర్వా 4 వికెట్లు తీశాడు.

భారీ లక్ష్యంతో నేపాల్ బరిలోకి దిగింది. జొలార్డ్ గుంబి(25), వెస్లీ మాధేవేర్(32) త్వరగానే ఔట్ అయ్యారు. మూడో వికెట్ కు వచ్చిన కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ అద్భుతంగా ఆడి జట్టుకు గెలుపుని అందించారు. క్రైహ్ 128 బంతుల్లో 121 పరుగులు చేశాడు. విలియమ్స్ 70 బంతుల్లో 102 పరగులు పూర్తి చేశాడు. జింబాబ్వే 44.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి గెలిచింది.

తదుపరి వ్యాసం