తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Top Moments For India : 2022లో భారతీయులకు క్రీడల్లో మరపురాని క్షణాలు

Top Moments For India : 2022లో భారతీయులకు క్రీడల్లో మరపురాని క్షణాలు

Anand Sai HT Telugu

26 December 2022, 17:15 IST

    • Year Ender 2022 : కామన్వెల్త్ గేమ్స్ నుంచి థామస్ కప్ వరకు.., 2022లో ప్రతిచోటా భారతదేశం త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది. 2022లో భారతీయ క్రీడల్లో మరపురాని క్షణాలను ఓసారి చూద్దాం..
నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా (Neeraj Chopra Twitter)

నీరజ్ చోప్రా

2022 సంవత్సరం ఎండింగ్ వచ్చేసింది. అన్ని రంగాల మాదిరిగానే ఈసారి క్రీడా రంగంలోనూ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా క్రీడారంగంలో ఈసారి భారత్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి థామస్‌ కప్‌ వరకు అన్ని చోట్లా భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 2022లో భారతీయులకు క్రీడల్లో ఎన్నో మరపురాని క్షణాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

విరాట్ కోహ్లికి ఓ వైపు తీపి.. చేదు కూడా : టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈ ఏడాది తీపి, చేదు అనుభవం ఎదురైంది. ఏడాది ప్రారంభంలోనే టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ద్వారా టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. దీంతో భారత క్రికెట్‌లో కెప్టెన్‌గా కోహ్లీ శకం ముగిసిట్టైంది. ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేయడం, బంగ్లాదేశ్‌పై వన్డే సెంచరీతో 3 ఏళ్ల నుంచి సెంచరీ లేని కోహ్లీకి 2022 కలిసి వచ్చింది. భారత్ అంతా కోహ్లీతో కలిసి సంబరం చేసుకుంది.

టీమ్ ఇండియా ఛాంపియన్ : ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్లో ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ముఖ్యంగా గత రెండేళ్లలో ఐసీసీ టోర్నీలో టీమ్ ఇండియా గెలిచిన ఏకైక టైటిల్ ఇదే.

రజత పతకం : కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి రజత పతకం సాధించింది. స్వర్ణంపై ఆశలు పెట్టుకున్న టీమ్ ఇండియా మహిళలు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. తద్వారా రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

థామస్ కప్ : క్రికెట్‌తో పాటు బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌ అద్భుత ప్రదర్శన చేసింది. 2022లో పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తొలిసారిగా థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది.

తొలి కప్ : ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఈ ఘనత సాధించింది.

పవర్‌ఫుల్ పంచ్ : భారత స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఈ ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.

మనోడికి రజతం : ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో భారత్‌కు బంగారు పతకాన్ని నీరజ్ చోప్రా తీసుకొచ్చిన విషయం తెలిసింతే. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

చెస్ ఒలింపియాడ్ : 98 ఏళ్ల చరిత్ర కలిగిన 44వ ఎడిషన్ చెస్ ఒలింపియాడ్‌కు భారత్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. చెన్నైలో జరిగిన ఈ చెస్ పోటీల్లో 346 దేశాల నుంచి 350 జట్లు పాల్గొన్నాయి.

సమాన వేతన విధానం : ఈ ఏడాది భారత క్రికెట్ కౌన్సిల్ మహిళా క్రికెటర్లకు సమాన వేతనాన్ని ప్రకటించడం ద్వారా చారిత్రాత్మక అడుగు వేసింది. బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్న మహిళా క్రికెటర్లందరికీ మూడు ఫార్మాట్లలోని పురుషుల జట్లకు చెల్లించే మ్యాచ్ ఫీజునే చెల్లిస్తామని సెక్రటరీ జే షా ప్రకటించారు.

కామన్వెల్త్‌లో : ఈ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ ఏడాది భారత అథ్లెట్లు మొత్తం 61 పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం