తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jaffer On Hardik: డెత్ ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేయాల్సింది.. అస్సలు ఊహించలేదు.. జాఫర్ కామెంట్స్

Jaffer on Hardik: డెత్ ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేయాల్సింది.. అస్సలు ఊహించలేదు.. జాఫర్ కామెంట్స్

06 January 2023, 16:12 IST

    • Jaffer on Hardik: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసుంటే బాగుండేదని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కానీ శివమ్ మావికి బౌలింగ్ ఇచ్చాడని, తాను అస్సలు ఊహించలేదని స్పష్టం చేశాడు.
హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య (PTI)

హార్దిక్ పాండ్య

Jaffer on Hardik: శ్రీలంకతో శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. బౌలర్ల చెత్త ప్రదర్శనకు తోడు.. టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఫలితంగా లంకేయులు 1-1తో సిరీస్‌ను సమం చేశారు. ముందుగా బౌలింగ్ చేసిన భారత్.. డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంది. ముఖ్యంగా చివరి ఓవర్ వేసిన శివమ్ మావి 20 పరుగులు సమర్పించాడు. తాజాగా ఈ అంశంపై వసీం జాఫర్ స్పందించాడు. డెత్ ఓవర్లలో శివమ్ మావి స్థానంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడనుకున్నానని, కానీ అలా జరగలేదని జాఫర్ స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"డెత్ ఓవర్లలో శివమ్ మావి స్థానంలో హార్దిక్ బౌలింగ్ చేస్తాడనుకున్నా. డెత్ బౌలింగ్‌లో మావికి తగినంత అనుభవం లేదు. హార్దిక్ లాంటి అనుభవజ్ఞుడు బౌలింగ్ చేయాల్సింది. 20వ ఓవర్లో అతడే బౌలింగ్ చేస్తాడని నేను అనుకున్నా. కానీ అలా జరగలేదు. నాకు ఆశ్చర్యమేసింది. ఆరో ఓవర్ తర్వాత తిరిగి బౌలింగ్ చేయడానికి వస్తాడనుకున్నా. బహుశా మిడిల్ ఓవర్లలో లేదా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తాడనుకున్నా. అంతేకాకుండా అర్ష్‌దీప్‌కు కేవలం 2 ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. ఈ విషయం హార్దిక్ అంచనా తప్పయింది." అని జాఫర్ తెలిపాడు.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ దసున్ శనకా, కుశాల్ మెండీస్ అద్భుత అర్ధశతకాలతో విజృంభించారు. 207 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ విఫలం కావడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అక్షర్ పటేల్(65), సూర్యకుమార్ యాదవ్(51) అర్ధశతకాలతో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ జట్టును ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు. చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. భారత్ 5 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టాపిక్

తదుపరి వ్యాసం