తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  England Vs India: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు కోహ్లీ అనుమానం.. కారణం అదేనా?

England vs India: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు కోహ్లీ అనుమానం.. కారణం అదేనా?

12 July 2022, 6:07 IST

    • మంగళవారం నాడు ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు కోహ్లీ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా అతడు ఆడతాడా లేదా అనేది సందిగ్ధత నెలకొంది.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AFP)

విరాట్ కోహ్లీ

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లీష్ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌కు సమాయత్తమవుతుతోంది. మంగళవారం నాడు తొలి వన్డే ప్రారంభం కానుంది. అయితే గత కొన్ని రోజులుగా వరుసగా విఫలమవుతున్న విరాట్.. ఇటీవల జరిగిన రీషెడ్యూల్ ఐదో టెస్టు, టీ20 సిరీస్‌లోనూ ఘోరంగా ఫ్లాపయ్యాడు. ఇదిలా ఉంటే అతడికి గజల్లో గాయం మరో సమస్యలా మారింది. దీంతో అతడు మంగళవారం నాడు ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి వన్డేలో ఆడేది అనుమానంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

సోమవారం నాడు ప్రాక్టీస్‌లోనూ పాల్గొనని కోహ్లీ.. తొడ ప్రాంతంలో కండరాలు పట్టుకోవడంతో ఇబ్బందిపడ్డాడు. ఈ కారణంగా బహుశా అతడిని మొదటి వన్డేకు విశ్రాంతి ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విరామం జులై 14, 17వ తేదీల్లో జరిగే రెండు, మూడు వన్డేలకూ వర్తిస్తుందా అనేది స్పష్టత లేదు.

గత గేమ్‌లో విరాట్ తొడ ప్రాంతంలో కండరాలు పట్టడం వల్ల ఇబ్బంది పడ్డాడు. అది ఫీల్డింగ్ లేదా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జరిగిందా అనేది తెలియదు. బహుశా అతడు మొదటి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చు. సమస్య గజ్జల్లో కావడం వల్ల మొదటి వన్డేకు కోహ్లీకి విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియా వర్గాలకు తెలిపారు.

కనీసం నోటింగ్హామ్ నుంచి లండన్‌కు కూడా టీమ్ బస్‌లో కోహ్లీ వెళ్లలేదని, మెడికల్ చెకప్ కోసం ఆగినట్లు అతడు ఆగినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ తొలి వన్డేలో కోహ్లీ ఆడతాడా లేదా అనేదానిపై జట్టు మేనేజ్మెంట్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

సోమవారం నాడు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు కొంతమంది మాత్రమే పాల్గొన్నారు. శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ లండన్‌లోని ఓవల్ మైదానంలో హాజరయ్యారు. ఈ కారణంగా వెస్టిండీస్‌తో ఆగస్టులో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయడం ఆలస్యమవుతోంది. మంగళవారం నాడు బీసీసీఐ జట్టును ప్రకటించనుంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై క్రీడా ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు. పొట్టి ఫార్మాట్‌కు అతడిని దూరం పెట్టాలని సూచించారు. కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి మాజీలు కోహ్లీ ప్రదర్శనపై ప్రశ్నలు సంధించారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. విరాట్‌కు మద్దతుగా మాట్లాడుతూ ధీటుగా బదులిచ్చాడు.

తదుపరి వ్యాసం