తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Umran Malik Fastest Delivery: ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనత.. బుమ్రా రికార్డు బద్దలు

Umran Malik Fastest delivery: ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనత.. బుమ్రా రికార్డు బద్దలు

04 January 2023, 11:07 IST

  • Umran Malik Fastest delivery: టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనతను సాధించాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి టీ20లో అత్యంత వేగవంతమైన డెలివరీని సంధించాడు. ఫలితంగా గతంలో బుమ్రా అందుకున్న రికార్డును అధిగమించాడు.

ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ డెలివరీ
ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ డెలివరీ

ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ డెలివరీ

Umran Malik Fastest delivery: శ్రీలంకతో ఉత్కంఠ భరితంగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత బౌలర్లు పొదుపుగా బౌలింగే చేసి లంక జట్టును లక్ష్యానికి 2 పరుగుల దూరానికి పరిమితం చేశారు. ఫలితంగా భారత్ 3 మ్యాచ్‍‌ల సిరీస్‌ను 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో శివమ్ మావి 4/27 గణాంకాలతో విజృభించగా.. టీమిండియా యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లతో అతడికి గట్టి సపోర్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. తన ప్రమాదకరమైన పేస్‌తో ఆకట్టుకున్నాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన డెలివరీని సంధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఉమ్రాన్ మాలిక్ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతినేసి అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ దసున్ శనకాను ఔట్ చేసిన బంతిని అతడు గంటకు 155 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఆఫ్ సైడ్ దిశగా వస్తున్న ఆ బంతిని శనకా ఎక్స్‌ట్రా కవర్‌లో ఆడగా.. యజువేంద్ర చాహల్ ఆ బంతిని ఒడిసి పట్టాడు. దీంతో ప్రమాదకర శనకా పెవిలియన్ చేరాడు. అతడు 27 బంతుల్లో 45 పరుగులు చేశాడు.

ఇంతకు ముందు అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును ఉమ్రాన్ మాలిక్ అధిగమించాడు. బుమ్రా గతంలో అత్యధికంగా గంటకు 153.35 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అనంతరం మహమ్మద్ షమీ గంటకు 153.3 కిలోమీటర్ల వేగంతో, నవదీప్ సైనీ గంటకు 152.85 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశారు. తాజాగా వీరందరినీ తోసిరాజని అత్యధిక వేగవంతమైన రికార్డును క్రియేట్ చేశాడు.

శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 2 పరుగుల దూరంలో ఉండిపోయింది. చివరి ఓవర్లో లంక గెలుపునకు 13 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్ బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ 10 పరుగులే ఇచ్చాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లలో దీపక్ హుడా చివరి వరకు పోరాడి జట్టు మెరుగైన స్కోరు సాధించడంతో కీలక పాత్ర పోషించాడు.

తదుపరి వ్యాసం