తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Umran Malik Speed: గంటకు 153.1 కి.మీ.. తొలి వన్డేలోనే స్పీడుతో చెలరేగిన ఉమ్రాన్‌

Umran Malik Speed: గంటకు 153.1 కి.మీ.. తొలి వన్డేలోనే స్పీడుతో చెలరేగిన ఉమ్రాన్‌

Hari Prasad S HT Telugu

25 November 2022, 14:33 IST

    • Umran Malik Speed: గంటకు 153.1 కి.మీ. వేగంతో తొలి వన్డేలోనే స్పీడుతో చెలరేగాడు ఉమ్రాన్‌ మాలిక్‌. టీ20ల్లో ఛాన్స్‌ దక్కకపోయినా.. వన్డే మ్యాచ్‌ ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు.
ఉమ్రాన్ మాలిక్
ఉమ్రాన్ మాలిక్ (AP)

ఉమ్రాన్ మాలిక్

Umran Malik Speed: స్పీడుతో బెంబేలెత్తించడం ఉమ్రాన్‌ మాలిక్‌కు కొత్త కాదు. అసలు ఐపీఎల్‌లో ఆ స్పీడుతోనే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో వన్డే అరంగేట్రం చేసిన అతడు.. తొలి మ్యాచ్‌లోనే తన స్పీడు చూపించాడు. 307 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను మొదట్లోనే ఉమ్రాన్‌ దెబ్బ తీశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అతడు కీలకమైన రెండు వికెట్లు కూడా తీశాడు. డెవోన్‌ కాన్వే, డారిల్‌ మిచెల్‌లను అతడు తన స్పీడుతో బోల్తా కొట్టించాడు. ఇక న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో రెండో బంతి వేగం గంటకు 153.1 కి.మీ. కావడం విశేషం. డారిల్‌ మిచెల్‌కు అతడు ఆ బాల్ వేశాడు. ఆ బంతికి అతడు రెండు పరుగులు తీయగలిగాడు.

ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఉమ్రాన్‌.. 145 రేంజ్‌లో బౌలింగ్‌ చేశాడు. రెండో ఓవర్లో తొలిసారి 150 మార్క్‌ అందుకున్నాడు. ఇక మూడో ఓవర్లో తన తొలి వన్డే వికెట్‌ను ఉమ్రాన్‌ తీసుకున్నాడు. ఓపెనర్‌ డెవోన్‌ కాన్వేను అతడు ఔట్‌ చేశాడు. దీంతో అక్కడి నుంచి ఉమ్రాన్‌ బౌలింగ్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడారు.

ఇక తన ఐదో ఓవర్లో ఉమ్రాన్‌ మరో వికెట్‌ తీసుకున్నాడు. ఈసారి డారిల్‌ మిచెల్‌ను ఔట్‌ చేశాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బాల్‌ను చేజ్‌ చేయబోయిన మిచెల్‌.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఉమ్రాన్‌ తన తొలి ఐదు ఓవర్లలో కేవలం 19 రన్స్‌ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నా.. తర్వాత తడబడ్డాడు. చివరికి 10 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చుకున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో స్పీడుతో బెంబేలెత్తించిన ఉమ్రాన్‌.. తర్వాత ఐర్లాండ్‌ సిరీస్‌కు తొలిసారి ఇండియన్‌ టీమ్‌కు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ ఓ టీ20లో ఆడాడు. ఆ సమయంలో టీ20 వరల్డ్‌కప్‌కు అతడు పక్కా అని అనుకున్నా.. తర్వాత స్థానం కోల్పోయాడు. తిరిగి న్యూజిలాండ్ టూర్‌కు ఎంపికైనా టీ20ల్లో అవకాశం రాలేదు.

తదుపరి వ్యాసం