తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sl Vs Ire T20 World Cup 2022: ఐర్లాండ్‌పై శ్రీలంక ఘ‌న విజ‌యం

SL vs IRE T20 World Cup 2022: ఐర్లాండ్‌పై శ్రీలంక ఘ‌న విజ‌యం

23 October 2022, 12:51 IST

  • SL vs IRE T20 World Cup 2022: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆదివారం ఐర్లాండ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంక‌ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో శ్రీలంక ప్లేయ‌ర్స్ రాణించారు.
కుశాల్ మెండిస్
కుశాల్ మెండిస్

కుశాల్ మెండిస్

SLvs IRE T20 World Cup 2022: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆదివారం ఐర్లాండ్‌ను శ్రీలంక చిత్తు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకున్న‌ది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు న‌ష్ట‌పోయి 128 ర‌న్స్ మాత్ర‌మే చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

టెక్టార్ (42 బాల్స్‌లో 45 ర‌న్స్), స్టిర్లింగ్ (25 బాల్స్‌లో 34 ర‌న్స్ మాత్ర‌మే రాణించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫ‌ల‌మ‌య్యారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో హ‌సరంగ, తీక్ష‌ణ త‌లో రెండు వికెట్లు తీశారు. 129 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలో దిగిన శ్రీలంక ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది.

ఓపెన‌ర్ కుశాల్ మెండిస్ 43 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 68 ర‌న్స్ చేశాడు. ధ‌నుంజ‌య డిసిల్వా 25 బాల్స్‌లో 31 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అస‌లంక 31 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.

తదుపరి వ్యాసం