తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Surya Kumar Yadav T20 Records: రోహిత్ శ‌ర్మ రికార్డ్‌ను స‌మం చేసిన సూర్య‌కుమార్

Surya Kumar Yadav T20 Records: రోహిత్ శ‌ర్మ రికార్డ్‌ను స‌మం చేసిన సూర్య‌కుమార్

20 November 2022, 17:51 IST

  • Surya Kumar Yadav T20 Records: ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో సెంచ‌రీతో చెల‌రేగాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌. 51 బాల్స్‌లోనే 111 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో టీ20 క్రికెట్‌లో ప‌లు రికార్డుల‌ను సూర్య‌కుమార్ అధిగ‌మించాడు. ఆ రికార్డ్స్ ఏవంటే...

సూర్య‌కుమార్ యాద‌వ్‌
సూర్య‌కుమార్ యాద‌వ్‌

సూర్య‌కుమార్ యాద‌వ్‌

Surya Kumar Yadav T20 Records: న్యూజిలాండ్‌తో ఆదివారం జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెల‌రేగాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌. కేవ‌లం 51 బాల్స్‌లోనే ఏడు సిక్స‌ర్లు, 14 ఫోర్ల‌తో 111 ప‌రుగులు చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్ నాటౌట్‌గా నిలిచాడు. సూర్య కుమార్ అస‌మాన ఇన్నింగ్స్‌తో ఈ టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 65 ప‌రుగులు తేడాతో న్యూజిలాండ్‌పై అద్భుత విజ‌యాన్ని అందుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో రెండు సెంచ‌రీలు చేసిన రెండో భార‌త క్రికెట‌ర్‌గా నిలిచాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌. 2018 ఏడాదిలో రోహిత్ శ‌ర్మ టీ20క్రికెట్‌లో రెండు సెంచ‌రీలు చేశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా రోహిత్ రికార్డ్‌ను సూర్య‌కుమార్ స‌మం చేశాడు.

టీ20ల్లో న్యూజిలాండ్ టీమ్‌పై అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా సూర్య‌కుమార్ నిలిచాడు. గ‌తంలో ఈ రికార్డ్ (65 ర‌న్స్‌) రోహిత్ శ‌ర్మ పేరు మీద ఉన్న‌ది. రోహిత్ రికార్డ్‌ను సూర్య‌కుమార్ అధిగ‌మించాడు. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రెండో టీమ్ ఇండియా క్రికెట‌ర్‌గా కె.ఎల్ రాహుల్ రికార్డ్‌ను సూర్య‌కుమార్ స‌మం చేశాడు. ఈ జాబితాలో నాలుగు సెంచ‌రీల‌తో రోహిత్ టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా రోహిత్‌, రాహుల్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు.

తదుపరి వ్యాసం