తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sl Vs Pak: కొలంబోలో నిరసనలు.. పాక్‌తో రెండో టెస్ట్‌ వేదికను మార్చిన లంక బోర్డు

SL vs Pak: కొలంబోలో నిరసనలు.. పాక్‌తో రెండో టెస్ట్‌ వేదికను మార్చిన లంక బోర్డు

Hari Prasad S HT Telugu

18 July 2022, 15:11 IST

    • SL vs Pak: శ్రీలంకలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజధాని కొలంబోలో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి.
శ్రీలంక, పాకిస్థాన్ మధ్య గాలెలోనే జరుగుతున్న తొలి టెస్ట్
శ్రీలంక, పాకిస్థాన్ మధ్య గాలెలోనే జరుగుతున్న తొలి టెస్ట్ (AFP)

శ్రీలంక, పాకిస్థాన్ మధ్య గాలెలోనే జరుగుతున్న తొలి టెస్ట్

కొలంబో: శ్రీలంకలో ఓవైపు ఆందోళనలు జరుగుతున్నా మరోవైపు క్రికెట్‌ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతూనే ఉంది. ఈ మధ్య ఆస్ట్రేలియా టీమ్‌ ఆ దేశంలో పర్యటించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌ కూడా శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌ ఆడుతోంది. ఇప్పుడు తొలి టెస్ట్‌ జరుగుతుండగా.. ఈ నెల 24 నుంచి 28 వరకూ రెండో టెస్ట్‌ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్‌ కొలంబోలో జరగాల్సి ఉంది. అయితే అక్కడ నిరసనలు తీవ్రస్థాయిలో ఉండటంతో రెండో టెస్ట్‌ను కొలంబో నుంచి గాలె ఇంటర్నేషనల్‌ స్టేడియానికి తరలించింది. లంకలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రజల ఆందోళనతో గతంలో అధ్యక్షుడిగా ఉన్న గొటబాయ దేశం వదిలి పారిపోయారు.

అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మధ్యే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ సజావుగా సాగినా.. సమీప భవిష్యత్తులో మాత్రం అడ్డంకులు తప్పకపోవచ్చని లంక బోర్డు భావిస్తోంది. ఆ దేశంలో నిత్యావసరాలు కూడా దొరక్క ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యే శ్రీలంక క్రికెటర్‌ చమిక కరుణరత్నె మాట్లాడుతూ.. తన కారులో పెట్రోల్‌ కోసం రెండు రోజులు క్యూలో నిల్చోవాల్సి వచ్చిందని వాపోయాడు.

ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్‌ మధ్య తొలి టెస్ట్‌ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కేవలం 222 రన్స్‌కే ఆలౌట్‌ కాగా.. పాకిస్థాన్‌ కూడా 218 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో ఫెర్నాండో, కుశల్‌ మెండిస్‌ హాఫ్‌ సెంచరీలు చేయడంతో ఆ టీమ్‌ పాక్‌ ముందు చాలెంజింగ్‌ టార్గెట్‌ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లంక లీడ్‌ 250 దాటింది.

తదుపరి వ్యాసం