తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Commonwealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌ లైవ్‌ ఏ ఛానెల్‌లోనో తెలుసా?

Commonwealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌ లైవ్‌ ఏ ఛానెల్‌లోనో తెలుసా?

Hari Prasad S HT Telugu

19 July 2022, 20:56 IST

    • Commonwealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌ పండగకు టైమ్‌ దగ్గర పడుతోంది. ఈ నెల 28 నుంచి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఈ మెగా ఈవెంట్‌ జరగనుంది.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొననున్న ఇండియన్ అథ్లెట్స్ తో క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్
కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొననున్న ఇండియన్ అథ్లెట్స్ తో క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ (PTI)

కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొననున్న ఇండియన్ అథ్లెట్స్ తో క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్

లండన్‌: మరో మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్‌ మనల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి వస్తోంది. నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ ఈసారి జులై 28 నుంచి ఆగస్ట్‌ 8 వరకూ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్నాయి. ఈసారి ఇండియా సహా మొత్తం 72 దేశాలు 19 స్పోర్ట్స్‌లో మెడల్స్‌ కోసం తలపడనున్నాయి. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, హాకీ, జూడోలాంటి స్పోర్ట్స్‌ ఈ గేమ్స్‌లో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈసారి ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌ ఎక్స్‌క్లూజివ్‌ టీవీ, డిజిటల్‌ హక్కులను సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా సొంతం చేసుకుంది. ఇండియాతోపాటు ఉపఖండంలోని పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఆఫ్ఘనిస్థాన్‌, భూటాన్‌, మాల్దీవ్స్‌లో కామన్వెల్త్ గేమ్స్‌ను సోనీ ఛానెల్‌తోపాటు ఈ సంస్థ ఓటీటీ సోనీలివ్‌ ప్రసారం చేయనుంది. 11 రోజుల పాటు ఈ గేమ్స్‌ స్పోర్ట్స్‌ లవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనున్నాయి.

ఇక ఈసారి కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రత్యేకత ఏంటంటే.. టీ20 ఫార్మాట్‌లో తొలిసారి మహిళల క్రికెట్‌ టీమ్స్‌ ఇందులో తలపడుతున్నాయి. వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్స్‌ ఈ గేమ్స్‌లో పార్టిసిపేట్‌ చేయడానికి ఐసీసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ టీమ్స్‌లో ఇండియా కూడా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. ఇక కామన్వెల్త్‌ గేమ్స్‌లో గత రెండు దశాబ్దాలుగా ఇండియా తన మెడల్స్‌ సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది.

2010లో ఢిల్లీలో జరిగిన గేమ్స్‌లో అత్యధికంగా 101 మెడల్స్‌ గెలిచిన ఇండియా.. 2018లో 66 మెడల్స్‌ సాధించింది. ఈసారి క్రికెట్‌ కూడా చేరడంతో ఈ స్పోర్ట్‌లో ఇండియా మరో మెడల్‌పై ఆశలు పెట్టుకుంది.

టాపిక్

తదుపరి వ్యాసం