తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gt Vs Rr | విజయంలో అదృష్టం, టాస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి: శాంసన్

Gt vs RR | విజయంలో అదృష్టం, టాస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి: శాంసన్

25 May 2022, 7:10 IST

    • రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్‌తో మ్యాచ్‌ తర్వాత మాట్లాడిన అతడు.. విజయంలో టాస్, లక్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై గెలిచింది.
సంజూ శాంసన్
సంజూ శాంసన్ (Twitter)

సంజూ శాంసన్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. డేవిడ్ మిల్లర్ వీరోచిత పోరాటంతో గుజరాత్ ఫైనల్‌కు చేరింది. అయితే మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు. తాము బాగా ఆడామని, అయితే అదృష్టంతో పాటు టాస్ కూడా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"మా స్కోరు పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. వికెట్ కొంచె బౌలర్లకు కొంచెం అనుకూలంగానే ఉంది. పవర్ ప్లేలో స్వింగ్ అయింది. బౌన్స్ కూడా లేదు. పవర్ ప్లేలో మేము పరుగులు చేయడం మా అదృష్టం. ఇలాంటి పరిస్థితిల్లో మంచి స్కోరు చేశాం. కానీ రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. మేము బాగా ఆడినప్పటికీ రెండు ఓవర్లు, అదనపు పరుగులతో మూల్యం చెల్లించుకున్నాం. ఇక్కడ అదృష్టం, టాస్ పెద్ద పాత్ర పోషిస్తున్నాయి" అని సంజూ శాంసన్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ వీరోచిత పోరాటంతో గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. చివరి ఓవర్‌లో విజయానికి పరుగులు అవసరం కాగా.. ప్రసిధ్ కృష్ణ వేసిన ఆ ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ వరుసగా మూడు సిక్సర్లు బాది గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించారు. రాజస్థాన్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో మూడు బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. మిల్లర్ 38 బంతుల్లో 68 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్య 40 పరుగులతో బాధ్యతయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ఓబెడ్ మెకాయ్ చెరో వికెట్ తీశారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 56 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. జాస్ బట్లర్ మరోసారి 89 పరుగులతో అదరగొట్టినప్పటికీ.. అతడి కష్టం వృథా అయింది. కెప్టెన్ సంజూ శాంసన్ 26 బంతుల్లో47 పరుగులతో ధాటిగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, అల్జారీ జోసెఫ్, సాయి కిశోర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం