తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Holi 2022 | విషెస్ చెప్పేందుకు రోహిత్ నానా తంటాలు.. ఎన్ని టేకులు తీసుకున్నాడో

Holi 2022 | విషెస్ చెప్పేందుకు రోహిత్ నానా తంటాలు.. ఎన్ని టేకులు తీసుకున్నాడో

18 March 2022, 15:40 IST

    • భారత కెప్టెన్ రోహిత్ శర్మ హోలీ శుభాకాంక్షలు చెప్పేందుకు నానా తంటాలు పడ్డాడు. వీడియో ద్వారా విషెస్ చెప్పేందుకు ప్రయత్నించిన హిట్ మ్యాన్ అనేక టేకులు తీసుకున్నాడు. ఈ వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు.
రోహిత్ శర్మ (ప్రతీకాత్మక చిత్రం)
రోహిత్ శర్మ (ప్రతీకాత్మక చిత్రం) (ANI)

రోహిత్ శర్మ (ప్రతీకాత్మక చిత్రం)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసి ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబానికి అధిక ప్రాధాన్యమిచ్చ హిట్ మ్యాన్‌.. ప్రస్తుతం హోలీ వేడుకలను వారితో కలిసి ఆనందంగా జరుపకుంటున్నాడు. ఈ రంగుల పండుగ రోజు రోహిత్.. అభిమానులకు వినూత్నంగా విషెస్ చెప్పేందుకు నానా కష్టాలు పడ్డాడు. అభిమానులకు హోలీ శుభాకాంక్షలు చెప్పేందుకు వీడియో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. అందరికీ హోలీ శుభకాంక్షలు అని చెప్పేందుకు చాలా టేకులు తీసుకున్నాడు. విషెస్ చెప్పేందుకు ఇబ్బంది పడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అంతేకాదు ఈ వీడియో కింద తన ఫ్యాన్స్‌ను ఉద్దేసిస్తూ సందేశాన్ని కూడా రాశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"మీరంతా ఆనందంగా హోలీ జరుపుకోవాలని నేను హ్యాపీ హోలీ అని చెప్పాలనకున్నాను. మీరంతా సరదాగా గడుపుతున్నప్పుడు చుట్టూ పక్కల ఉండే పెంపుడు జంతువులను దృష్టిలో పెట్టుకోండి. వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. పండుగను బాధ్యతయుతంగా జరుపుకునే సమయంలో వాటిపై శ్రద్ధ పెట్టాలి" అని రోహిత్ తన అభిమానులను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టాడు.

ఈ వీడియోను గమనిస్తే రోహిత్ అనేక రీటేకుల తర్వాత కూడా తను అనుకున్న సందేశాన్ని పర్ఫెక్టుగా చెప్పలేకోపోతాడు. ఈ విధంగా తమ కెప్టెన్ విషెస్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్న వీడియోను చూసి శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ కూడా ఆ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై ముంబయి ఇండియన్స్ కూడా స్పందించింది. ఈ రోజు ఇంటర్నెట్‌లో హాస్యాస్పదమైన హోలీ శుభకాంక్షలు ఇవే అని పోస్ట్ పెట్టింది.

హోలీ భారత్‌లో అతి ముఖ్యమైన పండగ. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకుంటారు. వివిధ రంగులను వెదజల్లుకుంటూ అందరూ కలిసి చేసుకుంటారు. సినీ ప్రముఖులు నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2022వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ జట్టుతో వచ్చి చేరాడు. మార్చి 27 ముంబయి ఇండియన్స్- దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ ఈ నెల 26న కోల్‌కతా-చెన్నై మధ్య ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం