తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Riyan Parag | ఎవడు పట్టించుకుంటాడు.. రియాన్‌ పరాగ్‌ మరో పొగరుబోతు ట్వీట్‌

Riyan Parag | ఎవడు పట్టించుకుంటాడు.. రియాన్‌ పరాగ్‌ మరో పొగరుబోతు ట్వీట్‌

HT Telugu Desk HT Telugu

17 May 2022, 15:32 IST

    • మాటతీరుతోపాటు ఫీల్డ్‌లో తన చేతల్లోనూ పొగరుగా కనిపిస్తాడు రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌. టాలెంటెడ్‌ క్రికెటరే అయినా.. కెరీర్‌ ప్రారంభ దశలోనే వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ (PTI)

రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్

ముంబై: ఫీల్డ్‌లో రియాన్‌ పరాగ్‌ చేసే ఎక్స్‌ట్రాలు మాజీ క్రికెటర్లకు కూడా ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ మధ్య లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఓ క్యాచ్‌ పట్టి బాల్‌ను కావాలని నేలపై పెడుతున్నట్లుగా పరాగ్‌ కనిపించాడు. అంతకుముందు అతను డైవ్‌ చేస్తూ పట్టిన క్యాచ్‌ను థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ఇవ్వడంతో పరాగ్‌ కావాలని ఇలా చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఇది చూసి అప్పుడు కామెంటరీ ఇస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హేడెన్‌.. పరాగ్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. ఇలా చేయడం సరి కాదు.. క్రికెట్‌ చాలా కాలం ఆడే ఆట. మా అందరి జ్ఞాపకాలు కూడా చాలా కాలం ఉంటాయి. అదృష్టంతో ఆటలాడకు.. అది ఎప్పుడు రివర్సయ్యేది తెలియదు అంటూ కాస్త ఘాటుగానే పరాగ్‌కు సలహా ఇచ్చాడు. భవిష్యత్తే అది తేలుస్తుంది అంటూ పక్కనే ఉన్న వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బిషప్‌ కూడా అన్నాడు. అటు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ కూడా పరాగ్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతన్ని దారుణంగా ట్రోల్‌ చేశారు.

అయితే ఇవేవీ పరాగ్‌ను మార్చకపోగా.. ఇప్పుడతను పరోక్షంగా మరో రెచ్చగొట్టే ట్వీట్‌ చేశాడు. "20 ఏళ్లలో ఎవడు పట్టించుకుంటాడు.. జీవితంలో ఇంకా చాలా ఉంది.. ఎంజాయ్‌ చేయండి" అంటూ పరాగ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సీజన్‌లో గతంలో విరాట్‌ కోహ్లి వికెట్‌ తీసి అతను చేసుకున్న సంబరాల విషయంలోనూ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో అతడు సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌లతోనూ గొడవపడ్డాడు.

టాపిక్

తదుపరి వ్యాసం