తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rafael Nadal: నాదల్ ఈజ్ బ్యాక్: ఏడాది బ్రేక్ తర్వాత సింగిల్స్‌లో గెలుపుతో రఫా పునరాగమనం

Rafael Nadal: నాదల్ ఈజ్ బ్యాక్: ఏడాది బ్రేక్ తర్వాత సింగిల్స్‌లో గెలుపుతో రఫా పునరాగమనం

02 January 2024, 17:43 IST

    • Rafael Nadal: స్పెయిన్ స్టార్ ఆటగాడు రఫేల్ నాదల్.. ఏడాది బ్రేక్ తర్వాత సింగిల్స్ మ్యాచ్ ఆడాడు. ఏకపక్ష గెలుపుతో తన పునరాగమాన్ని ఘనంగా చాటాడు. ఆ వివరాలివే..
రఫేల్ నాదల్
రఫేల్ నాదల్ (AP)

రఫేల్ నాదల్

Rafael Nadal: 22 గ్రాండ్‍స్లామ్ టైటిళ్ల విజేత, స్పెయిన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ రఫేల్ నాదల్.. తుంటి గాయం కారణంగా సుమారు ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే బ్రేస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీతో మళ్లీ బరిలోకి దిగాడు. అయితే, ముందుగా పురుషుల డబుల్స్ మ్యాచ్‍లో మార్క్ లోపేజ్‍తో కలిసి బరిలోకి దిగిన నాదల్‍కు ఓటమి ఎదురైంది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, నేడు (జనవరి 2) జరిగిన బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‍లో రఫేల్ నాదల్ సత్తాచాటాడు. 349 రోజుల తర్వాత సింగిల్స్ మ్యాచ్ ఆడిన రఫేల్ నాదల్.. ఏకపక్ష గెలుపుతో సత్తాచాటాడు. సింగిల్స్ పునరాగమనాన్ని ఘనంగా చేశాడు. దీంతో రఫా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఏటీపీ 250 టోర్నీలో నేడు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో రఫేల్ నాదల్ 7-5, 6-1 తేడాతో ఆస్ట్రియా స్టార్ ప్లేయర్ డొమినిక్ థీమ్‍పై వరుస సెట్లలో విజయం సాధించాడు. తన మార్క్ బ్యాక్ హ్యాండ్ షాట్లతో రఫా ఈ మ్యాచ్‍లో రెచ్చిపోయాడు. పూర్తిస్థాయిలో ఫిట్‍నెస్‍తో ఉన్నట్టు కనిపించాడు.

ఈ మ్యాచ్‍లో ఆరంభం నుంచి థీమ్‍పై రఫేల్ నాదల్ ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే, తొలి సెట్‍లో థీమ్ కూడా గట్టి పోటీని ఇచ్చాడు. దీంతో ఓ దశలో 5-5తో గేమ్స్ సమమయ్యాయి. ఆ దశలో నాదల్ దూకుడు పెంచాడు. ప్రత్యర్థి సర్వీస్‍ను కూడా బ్రేక్ చేశాడు. దీంతో 7-5తో తొలి సెట్ కైవసం చేసుకున్నాడు.

ఇక, రెండో సెట్‍లో రఫా విజృంభించాడు. బలమైన బ్యాక్‍ హ్యాండ్ షాట్లతో వరుస పాయింట్లు సాధిస్తూ థీమ్‍కు చెమటలు పట్టించాడు. ఓ దశలో 3-0తో ఆధిపత్యం ప్రదర్శించాడు నాదల్. ఆ తర్వాత థీమ్ ఓ గేమ్ గెలిచినా చతికిలపడ్డాడు. అదే దూకుడు కొనసాగించిన నాదల్.. 6-1తో రెండో సెట్ గెలిచాడు. సింగిల్స్ పునరాగమన మ్యాచ్‍లో ఏకపక్ష విజయంతో సత్తాచాటాడు.

గతేడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో తుంటి గాయం బారిన పడ్డాడు నాదల్. దీంతో రెండో రౌండ్‍లోనే ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పడు సుమారు ఏడాది తర్వాత పునరామనం చేశాడు. ఈ ఏడాది (2024) ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ ఆడేందుకు సన్నాహకంగా ఇప్పుడు బ్రిస్బేన్ టోర్నీలో నాదల్ బరిలోకి దిగాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ జనవరి 14న మొదలుకానుంది.

తదుపరి వ్యాసం