తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sourav Ganguly | ఎడ్యుకేషన్ యాప్ లాంచ్ చేస్తున్నా.. రాజీనామా లేదు ఏంలేదు: గంగూలీ

Sourav Ganguly | ఎడ్యుకేషన్ యాప్ లాంచ్ చేస్తున్నా.. రాజీనామా లేదు ఏంలేదు: గంగూలీ

Hari Prasad S HT Telugu

01 June 2022, 22:18 IST

    • బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ బుధవారం సాయంత్రం తాను చేసిన ట్వీట్‌పై వివరణ ఇచ్చారు. ఈ ట్వీట్‌ తీవ్ర గందరగోళానికి దారి తీయడంతో నేరుగా ఆయనే రంగంలోకి దిగిన పుకార్లకు చెక్‌ పెట్టారు.
సౌరవ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ (Arunkumar Rao)

సౌరవ్ గంగూలీ

కోల్‌కతా: నేను క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో 30 ఏళ్లు అవుతోంది.. ఈ సందర్భంగా నేను ఒకటి ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నాను.. ఇది చాలా మందికి సాయపడుతుందని అనుకుంటున్నాను అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన ట్వీట్‌ ఎన్నో రకాల గందరగోళాలకు కారణమైంది. ఆయన బీసీసీఐకి రాజీనామా చేశారని, రాజకీయాల్లో చేరుతున్నారని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

చివరికి బీసీసీఐ కార్యదర్శి జే షా, కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌లు ఈ వార్తలను ఖండించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు గంగూలీయే తన ట్వీట్‌ వెనుక అర్థమేంటో వెల్లడించారు. "నేను రాజీనామా చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా నేను ఒక ఎడ్యుకేషన్‌ యాప్‌ లాంచ్‌ చేయబోతున్నాను. రాజీనామా లేదు. ఏంలేదు" అని గంగూలీ చెప్పడం గమనార్హం.

అంతకుముందు బుధవారం సాయంత్రం ఆయన అస్పష్టమైన ట్వీట్ చేయడంతో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని, రాజకీయాల్లో చేరబోతున్నారన్న వార్తలు వచ్చాయి. గత నెలలో తన ఇంట్లో హోంమంత్రి అమిత్‌ షాకు ఆతిథ్యమివ్వడం, ఆ తర్వాతి రోజే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతను పొగడటం వంటివి గంగూలీ రాజకీయ అరంగేట్రం పుకార్లకు తావిచ్చాయి. అయితే ఇప్పుడు గంగూలీ వివరణతో వాటన్నిటికీ తెరపడింది.

టాపిక్

తదుపరి వ్యాసం