తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Nz 1st Odi: తొలి వ‌న్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ - ఇండియా బ్యాటింగ్‌

IND vs NZ 1st ODI: తొలి వ‌న్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ - ఇండియా బ్యాటింగ్‌

25 November 2022, 6:45 IST

  • IND vs NZ 1st ODI: ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య నేడు తొలి వ‌న్డే జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న‌ది.

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌
ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌

IND vs NZ 1st ODI: శుక్ర‌వారం ఇండియాతో జ‌రుగుతోన్న తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ వ‌న్డే సిరీస్‌కు టీమ్ ఇండియా కెప్టెన్‌గా శిఖ‌ర్ ధావ‌న్ వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, భువ‌నేశ్వ‌ర్‌, ష‌మీతో పాటు సీనియ‌ర్స్ అంద‌రికి విశ్రాంతినిచ్చారు. టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన హార్దిక్ పాండ్య‌కు కూడా వ‌న్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చి ప‌క్క‌న‌పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్‌లో సంజూశాంస‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శుభ్‌మ‌న్‌గిల్, సూర్య‌కుమార్ యాద‌వ్‌ల‌తో టీమ్ ఇండియా బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగానే ఉంది. గ‌త కొంత కాలంగా వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతోన్న రిష‌బ్ పంత్‌కు ఈ వ‌న్డే సిరీస్ కీల‌కంగా మారింది.

పేస్ భారాన్ని అర్ష‌దీప్‌సింగ్‌తో పాటు స్పీడ్‌స్టార్ ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్ మోయ‌బోతున్నారు. మ‌రోవైపు టీ20 సిరీస్‌లో ఓట‌మి పాలైన న్యూజిలాండ్ తొలి వ‌న్డేలో బోణి చేయాల‌ని భావిస్తోంది. కేన్ విలియ‌మ్స‌న్‌, ఫిన్ అలెన్‌, కాన్వే, లాథ‌మ్ రాణించ‌డంపైనే న్యూజిలాండ్ విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డ్డాయి.

తదుపరి వ్యాసం