తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Neeraj Chopra: వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో నీర‌జ్ చోప్రాకు స్వ‌ర్ణం - తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డ్‌

Neeraj Chopra: వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో నీర‌జ్ చోప్రాకు స్వ‌ర్ణం - తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డ్‌

HT Telugu Desk HT Telugu

28 August 2023, 6:27 IST

  • Neeraj Chopra: వ‌ర‌ల్డ్ అథ్లెటిక్ ఛాంపియ‌న్ షిప్‌లో నీర‌జ్ చోప్రా అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడ‌ల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు.

నీర‌జ్ చోప్రా
నీర‌జ్ చోప్రా

నీర‌జ్ చోప్రా

Neeraj Chopra: ఒలింపిక్స్ గోల్డ్ మెడ‌లిస్ట్ నీర‌జ్ చోప్రా వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో స‌త్తాచాటాడు. స్వ‌ర్ణ ప‌తకం గెలుచుకొని చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశాడు. వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన‌ తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డ్ నెల‌కొల్పాడు. హంగేరి బుడాపెస్ట్ వేదిక‌గా జ‌రిగిన జావెలిన్ త్రో ఫైన‌ల్‌లో జావెలిన్‌ను 88.17 మీట‌ర్లు విసిరి గోల్డ్ మెడ‌ల్ సాధించాడు నీర‌జ్ చోప్రా.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఫౌల్ కార‌ణంగా తొలిరౌండ్‌లో జావెలిన్‌ను విస‌ర‌లేక‌పోయాడు నీర‌జ్ చోప్రా. సెకండ్ రౌండ్‌లో 88,17 మీట‌ర్ల దూరం జావెలిన్‌ను విసిరి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్ల‌డ‌మే కాకుండా ప‌తకం ఖాయం చేశాడు.

ఆ త‌ర్వాత ప్ర‌య‌త్నాల్లో 86.32, 84.64, 87.73, 83.98 మీట‌ర్లు విసిరాడు నీర‌జ్ చోప్రా. సిల్వ‌ర్ మెడ‌ల్‌ను పాకిస్థాన్‌కు చెందిన‌ అర్ష‌ద్ న‌దీమ్ (87.82 మీట‌ర్లు) ద‌క్కించుకోగా...చెక్ రిప‌బ్లిక్‌కు చెందిన జాక‌బ్ వ‌డ్‌లెజ్క్ (86.67 మీట‌ర్లు)తో బ్రాంజ్ మెడ‌ల్ కైవ‌సం చేసుకున్నాడు.

నీర‌జ్ చోప్రాతో పాటు జావెలిన్ త్రోలో పోటీప‌డ్డ ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ కిశోర్ జెనా (84.77) ఐదో స్థానంలో, డీపీ మ‌ను (84.14)ఆరో స్థానంలో నిలిచి త‌మ కెరీర్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచారు. షూట‌ర్ అభిన‌వ్ బింద్రా త‌ర్వాత ఒలింపిక్స్‌తో పాటు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ టైటిల్ గెలిచిన అథ్లెట్‌గా నీర‌జ్ చోప్రా రికార్డ్ క్రియేట్ చేశాడు.

టాపిక్

తదుపరి వ్యాసం