తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Maya Sonawane | వామ్మో.. ఇదేం యాక్షన్‌.. మాయా బౌలింగ్‌పై నెటిజన్లు షాక్‌

Maya Sonawane | వామ్మో.. ఇదేం యాక్షన్‌.. మాయా బౌలింగ్‌పై నెటిజన్లు షాక్‌

Hari Prasad S HT Telugu

24 May 2022, 18:27 IST

    • క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొందరి బౌలింగ్‌ యాక్షన్లు నవ్వు తెప్పిస్తుంటాయి. విచిత్రమైన యాక్షన్‌తో ఒకప్పుడు సౌతాఫ్రికా క్రికెటర్‌ పాల్ ఆడమ్స్‌, ఆ తర్వాత లసిత్‌ మలింగలాంటి వాళ్లు ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు ఓ మహిళా క్రికెటర్‌ బౌలింగ్‌పై ట్విటర్‌లో పెద్ద చర్చే నడుస్తోంది.
వెలాసిటీ టీమ్ బౌలర్ మాయా సోనావనె
వెలాసిటీ టీమ్ బౌలర్ మాయా సోనావనె (Twitter)

వెలాసిటీ టీమ్ బౌలర్ మాయా సోనావనె

ముంబై: ఐపీఎల్‌లాగే మహిళల కోసం వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌ ప్రారంభమైన విషయం తెలుసు కదా. ఇందులో భాగంగా సూపర్‌నోవాస్‌, వెలాసిటీ టీమ్స్‌ మధ్య మ్యాచ్‌లో ఓ బౌలర్‌ విచిత్రమైన యాక్షన్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వెలాసిటీ టీమ్‌కు చెందిన ఆ బౌలర్‌ పేరు మాయా సోనావనె. ఈమె తన వింత బౌలింగ్‌ యాక్షన్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈమె రైట్ ఆర్మ్‌ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌. సాధారణ బౌలింగ్‌ యాక్షన్‌కు పూర్తి విరుద్ధంగా ఈ ఈమె బంతిని తన తలపై నుంచి వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు సౌతాఫ్రికా స్పిన్నర్‌ పాల్‌ ఆడమ్స్‌ కూడా ఇలాగే వేసేవాడు. మాయా బౌలింగ్‌ చూసి చాలా మంది అతన్ని గుర్తు చేసుకున్నారు. మరికొందరు గతంలో ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్‌ టీమ్‌కు ఆడిన శివిల్‌ కౌశిక్‌తోనూ పోల్చారు.

మాయా సోనావనె ఈ టోర్నీలో ఆడకముందే సీనియర్‌ వుమెన్స్‌ టీ20 టోర్నీలో రెండుసార్లు నాలుగు వికెట్లు తీసుకొని వార్తల్లో నిలిచింది. ఆ టోర్నీలో 8 మ్యాచ్‌లలో 11 వికెట్లు తీసుకొని అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఇప్పుడు సూపర్‌నోవాస్‌తో మ్యాచ్‌లో ఆమె కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి 19 రన్స్‌ ఇచ్చింది. అయితే తన చిత్రమైన బౌలింగ్ యాక్షన్‌ మాత్రం అభిమానులను ఆకట్టుకుంది.

టాపిక్

తదుపరి వ్యాసం