తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Code Of Conduct | కేఎల్ రాహుల్‌కు జరిమానా.. నిబంధన ఉల్లంఘనకు ఫీజులో కోత

IPL Code of Conduct | కేఎల్ రాహుల్‌కు జరిమానా.. నిబంధన ఉల్లంఘనకు ఫీజులో కోత

20 April 2022, 12:27 IST

    • లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఐపీఎల్ మేనేజ్మెంట్ జరిమానా విధించింది. ఐపీఎల్ నిబంధన అతిక్రమించిన కారణంగా అతడికి మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించింది. అలాగ లక్నో బ్యాటర్ స్టాయినీస్‌ నిబంధన ఉల్లంఘించిన కారణంగా హెచ్చరించి వదిలేసింది.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (PTI)

కేఎల్ రాహుల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మరో నష్టం వాటిల్లింది. ఐపీఎల్ నిబంధన అతిక్రమించినందుకు అతడి మ్యాచ్‌ ఫీజులో కోత విధించినట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ముంబయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఐపీఎల్ నియమావళిని అతిక్రమించినట్లు తేలింది. అతడు లెవల్-1 నిబంధనను ఉల్లంఘించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ కారణంగా అతడి మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది. రాహుల్ కూడా తన తప్పు ఒప్పుకోవడంతో మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. ఈ మేరకు ఐపీఎల్ ఓ ప్రకటనను విడుదల చేసింది. కేఎల్ రాహుల్ ఇప్పటికే ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల జరిమానాను ఎదుర్కొన్నాడు. మరో రెండు సార్లు కనుక స్లో ఓవర్ రేటు నమోదు చేస్తే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరోపక్క లక్నో బ్యాటర్ మార్కస్ స్టాయినీస్ ఐపీఎల్ నియామవళీని అతిక్రమించినట్లు తేలింది. అయితే అతడు తృటిలో జరిమానా నుంచి తప్పించుకున్నాడు. వైడ్ విషయంలో అంపైర్‌ను తప్పపట్టడంతో లెవల్-1 నిబంధనను అతిక్రమించాడు. అయితే ఐపీఎల్ మేనేజ్మెంట్ అతడిని మందలింపుతో సరిపెట్టింది. మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చిరించింది. దీంతో జరిమానా నుంచి తప్పించుకున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 182 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 20 ఓవర్లలో 163 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. హేజిల్‌వుడ్ 4 వికెట్ల లక్నో పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసకెళ్లింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లిసిస్ అదరగొట్టాడు. 64 బంతుల్లో 96 పరుగులు చేసిన అతడు.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇందులో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 13 పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం