తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kkr Vs Lsg | థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో లక్నో విజయం.. కోల్‌కతా ఇంటికి..

KKR vs LSG | థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో లక్నో విజయం.. కోల్‌కతా ఇంటికి..

Hari Prasad S HT Telugu

18 May 2022, 23:27 IST

    • ఐపీఎల్‌ 2022లో మరో మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. లక్నోపై 211 పరుగుల భారీ స్కోరును చేజ్‌ చేసినంత పని చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 2 పరుగులతో ఓడి ఇంటికెళ్లిపోయింది.
2 రన్స్ తో గెలిచి ప్లేఆఫ్స్ కు చేరుకున్న లక్నో సూపర్ జెయింట్స్
2 రన్స్ తో గెలిచి ప్లేఆఫ్స్ కు చేరుకున్న లక్నో సూపర్ జెయింట్స్ (PTI)

2 రన్స్ తో గెలిచి ప్లేఆఫ్స్ కు చేరుకున్న లక్నో సూపర్ జెయింట్స్

ముంబై: మ్యాచ్‌ అంటే ఇదీ. మలుపుల మీద మలుపులు తిరిగిన ఈ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కేవలం 2 పరుగులతో గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 211 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా చివరికి 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 రన్స్‌ చేసింది. ఎప్పుడో ఆశలు వదులుకున్న మ్యాచ్‌లో రింకు సింగ్‌ (15 బాల్స్‌లో 40 రన్స్‌), సునీల్ నరైన్‌ (7 బంతుల్లో 21 రన్స్‌) ఆశలు రేపినా.. చివరి ఓవర్‌ చివరి రెండు బంతుల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు లక్నో బౌలర్‌ స్టాయినిస్‌. 

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

చివరి ఓవర్లో 21 రన్స్‌ అవసరం కాగా.. తొలి మూడు బంతుల్లో 4, 6, 6 కొట్టాడు రింకు సింగ్‌. అయితే ఐదో బంతికి అతడు ఔట్‌ అవడంతో చివరి బంతికి మూడు పరగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో ఉమేష్‌ యాదవ్‌ తొలి బంతికే ఔటవడంతో లక్నో 2 రన్స్‌తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. లక్నో బౌలర్‌ మోహ్‌సిన్‌ ఖాన్‌ 4 ఓవర్లలో కేవలం 20 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.

16వ ఓవర్‌ ముగిసే సమయానికి కోల్‌కతా స్కోరు 5 వికెట్లకు 144 రన్స్‌ చేసింది. 24 బంతుల్లో 67 రన్స్‌ చేయాలి. రసెల్‌ కూడా ఔటయ్యాడు. ఇక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో రింకు సింగ్‌, నరైన్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఈ ఇద్దరూ 7వ వికెట్‌కు 19 బాల్స్‌లోనే 58 రన్స్‌ జోడించారు.

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దారుణమైన ఆరంభం లభించింది. తొలి ఓవర్లోనే వెంకటేశ్‌ అయ్యర్‌ (0) ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే తొలి మ్యాచ్‌ ఆడుతున్న అభిజీత్‌ తోమార్‌ (4) కూడా పెవిలియన్‌ చేరడంతో 9 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఒత్తిడిలో పడుతుందనుకున్న ఆ టీమ్‌.. అక్కడి నుంచే చెలరేగి ఆడింది.

నితీష్‌ రాణా వచ్చి ఇన్నింగ్స్‌నే మార్చేశాడు. అవేష్‌ ఖాన్‌ వేసిన తొలి ఓవర్లోనే ఐదు ఫోర్లు బాదాడు. అతన్ని చూసి తర్వాతి ఓవర్లో హోల్డర్‌ను వరుసగా ఫోర్‌, సిక్స్‌, ఫోర్‌తో చితకబాదాడు శ్రేయస్‌ అయ్యర్‌. దీంతో ఒక్కసారిగా కోల్‌కతా క్యాంప్‌లో ఊపొచ్చింది. గౌతమ్‌ వేసిన ఆరో ఓవర్లో నితీష్‌ రాణా మరో మూడు ఫోర్లు బాదాడు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 60 రన్స్‌ చేసింది.

నితీష్‌ రాణా 22 బాల్స్‌లో 9 ఫోర్లతో 42 రన్స్‌ చేసి ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత కూడా కోల్‌కతా జోరు తగ్గలేదు. సామ్‌ బిల్లింగ్స్‌తో కలిసి అదే స్పీడు కొనసాగించాడు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌. ఈ క్రమంలో 28 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆ వెంటనే స్టాయినిస్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించి అదే స్కోరుపై ఔటయ్యాడు. సామ్‌ బిల్లింగ్స్‌ కూడా 24 బాల్స్‌లోనే 36 రన్స్‌ చేసి రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

టాపిక్

తదుపరి వ్యాసం